
Vijayasai Reddy Comments on TDP's Municipal Victory
‘మున్సిపోల్స్’లో కూటమి ఘన విజయం సాధించడంపై మూడు పార్టీలు పండగ చేసుకుంటున్నాయి. వాటికి ఓట్లు వేసిన ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. కానీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ విజయంపై భిన్నంగా స్పందించడం విశేషం. ఆయన ‘ఎక్స్’లో ఓ పోస్ట్ పెట్టారు.
సిఎం చంద్రబాబు నాయుడులో ఆత్మవిశ్వాసం లోపించింది కనుకనే అధికార దుర్వినియోగం చేసి ఎన్నికలలో గెలిచారు. కానీ ఈ ఎన్నికలతోనే టీడీపిలో భయం కనిపించింది. ఈ ఎన్నికల ఫలితాలతో 2029 ఎన్నికల నాటికి ఈ భయం మరింత పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో అయన వైసీపీని కాదు ప్రజలనే ఓడించారు,” అని ట్వీట్ వేశారు.
విజయసాయి రెడ్డి ఈ నెల 11న కొత్త పార్టీ ప్రకటన చేస్తారు. ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఈ సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. కానీ అయన చేసిన విమర్శలు గమనిస్తే జగన్ తరపున మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది.
ఇక ఈ విజయంతో టీడీపీ, జనసేన శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. సీట్ల సర్దుబాట్ల సమయంలో వాటి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడినా, పోలింగ్ సమయానికి కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించగలిగాయి.
ముఖ్యంగా ఈ ఎన్నికల్లో టీడీపి, జనసేనలు ఒకదాని గురించి మరొకటి చాలా విషయాలు తెలుసుకున్నాయి.ముఖ్యంగా జనసేన శ్రేణులు తమ సొంత బలం ఎంతుందో ఈ ఎన్నికలతో తెలుసుకోగలిగారు. లోపాలు, సమస్యలు గుర్తించగలిగారు.
కనుక ఈ ఎన్నికల అనుభవాలతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నామని, అవి వచ్చే ఎన్నికల్లో బాగా ఉపయోగపడతాయని ఒంగోలుకు చెందిన వీర మహిళ రాయపాటి అరుణ ‘ఎక్స్’లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు.
కనుక 2029 శాసనసభ ఎన్నికల నాటికి కూటమి పార్టీల మద్య మరింత అవగాహన ఏర్పడుతుంది. ఆ ఎన్నికలకు సీట్ల సర్దుబాట్లు తదితర అంశాలపై మూడు పార్టీలు ఇప్పటి నుంచే ‘రిహార్సల్స్’ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కనుక కూటమి మరింత సమన్వయంతో పనిచేస్తూ2029 శాసనసభ ఎన్నికలను అవలీలగా, చాలా ధైర్యంగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలవు.
ఈ ఎన్నికలు జరిగిన తీరు, ఫలితాలను చూసి ఆందోళన చెందాల్సింది విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డే. అలాగే విజయవాడలో ఏబీవీ రావును ముందు పెట్టి రాష్ట్రంలో సరికొత్త రాజకీయ ప్రయోగం చేయాలనుకున్న కాంగ్రెస్, వామపక్షాలే పునరాలోచించుకోవాల్సి ఉంటుంది తప్ప కూటమి పార్టీలు కానే కావు.
Former US Vice President Kamala Harris celebrated the Democratic Party's sweeping victory in the 2026…
ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను మనం ఏవిధంగా ఆసక్తిగా గమనిస్తామో, అదేవిధంగా ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన…