
కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్న సునీల్ కు ‘ఖైదీ నంబర్ 150’లో ఓ కీ రోల్ దక్కగా, దానిని సునీల్ వదులుకోవడం అప్పట్లో సంచలనాత్మకమైంది. సునీల్ ఇచ్చిన ‘జలక్’ నుండి తేరుకున్న చిత్ర యూనిట్, ఆ స్థానంలో అలీని ఎంపిక చేసి షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అయితే తానూ ఏదొక రోల్ లో ఖచ్చితంగా ‘అన్నయ్య’ సినిమాలో కనిపిస్తానని చెప్పిన సునీల్ మాటలు కార్యరూపం దాల్చుకోలేదు.
అప్పుడు మెగాస్టార్ కు జలక్ ఇవ్వగా, తాజాగా పవర్ స్టార్ కు కూడా అలాంటి జలక్కే ఇచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సునీల్ స్నేహితుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్ కాంభినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా సునీల్ కోసమని ఓ మంచి పాత్రను ఆఫర్ చేయగా, దీనిని కూడా సునీల్ ‘నో’ చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఓ పక్కన హీరోగా సక్సెస్ లు లేకపోయినా… తనకు వచ్చిన ప్రతిష్టాత్మక సినిమాలలో అవకాశాలు వదులుకోవడం పట్ల ట్రేడ్ వర్గాల్లో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా తేదీలు సర్దుబాట్లు కాకే ఈ ‘మెగా’ అవకాశాలను వదులుకుంటున్నారా? లేక హీరోగా తన స్థాయికి తగ్గించుకోలేక వాటిని కారణంగా చూపుతున్నారా? ఏది ఏమైనా మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాలకు ఇచ్చిన జలక్స్ తో సునీల్ పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుమ్రోగుతోంది.
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…