
తొలినాళ్లలో ఆమె నటించిన పోర్న్ సినిమాకు సంబంధించిన క్లిప్‌ను తాజా సినిమాలో చూసిన ఆమె ఎంత అణచిపెట్టుకున్నా కన్నీటిని బయటకు రాకుండా నియంత్రిచుకోలేకపోయింది. ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడ్చేసింది. గురునానక్ ఫొటోపై చేతులు వేసి…. “బాబాజీ తప్పు జరిగిపోయింది. నాకు తెలియకుండానే పెద్ద తప్పు చేశాను” అని వేడుకోవడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాకయ్యారు.
సన్నీలియోన్ బయోపిక్ ‘కరెన్జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్’లో స్వయంగా సన్నీనే నటించింది. తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను దర్శకనిర్మాతలకు పూసగుచ్చినట్టు గతంలో ఓ సారి తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సినిమాలో కనిపించే ప్రతీ సీనూ నిజమేనని, ప్రతీ కన్నీటి బొట్టు నిజమైనదేనని, తనదేనని వివరించింది. సన్నీ తనకు తానుగానే పోర్న్ స్టార్‌గా మారింది. నిజానికి సన్నీ అనేది ఆమె పేరు కాదు, ఆమె అన్నయ్య పేరు.
ఆ పేరుతోనే అడల్ట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. బాలీవుడ్‌లోకీ ప్రవేశించి సంచలనాలకు కారణమైంది. పలు వివాదాలకూ కారణమైంది. సిక్కు మత ఆచారాలను పాటించని ఆమె ‘కౌర్’ అనే పదాన్ని ఉపయోగించడం సరికాదని, టైటిల్లోని ఆ పదాన్ని తొలగించాలని సిక్కుమత పెద్దలు డిమాండ్ చేశారు. కాగా, అన్ని సినిమాలకు ఉన్నట్టుగానే సన్నీ బయోపిక్ లోని పలు ఎపిసోడ్లు ఇప్పటికే పైరసీ సైట్లలో దర్శనమిస్తున్నాయి.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…