
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దానిపై నేడు విచారణ చేపట్టిన జస్టిస్ నాగరత్న, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వాదనలు విన్న తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ, ప్రతీకార రాజకీయాల రొచ్చులోకి న్యాయస్థానాలను ఈడ్వవద్దంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ చిన్న విషయానికి సుప్రీంకోర్టుకి రావడం అలవాటుగా మారిందని ఆక్షేపించింది. ఈ కేసులో బెయిల్పై ఉన్న మాజీ మంత్రి నారాయణ సహకరించకపోతే అప్పుడు సంబందిత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది.
ఇదే వార్తను వైసీపీ అనుకూల మీడియాలో, ప్రతీకార రాజకీయాల గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు గురించి, ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ను కొట్టి వేసిన సంగతి పేర్కొనకుండా, ‘విచారణకు నారాయణ సహకరించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు సూచించిందనే’ ఒక్క విషయాన్నే హైలైట్ చేసి చూపింది. దీన్ని ఏ రంగు జర్నలిజం అంటారో?
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…
Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…