
సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులను, విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు, అమరావతి రైతులు ఎవరికి అనుకూలంగా వారు అన్వయించుకొని భాష్యాలు చెప్పుకొన్నారు.
రాజధాని విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని, ఇకనైనా టిడిపి, జనసేనలు బుద్ది తెచ్చుకొని మూడు రాజధానులకు వ్యతిరేకంగా కుట్రలు చేయడం మానుకోవాలని వైసీపీ మంత్రులు చెపుతున్నారు.
మూడు రాజధానుల అంశంపై చట్టం చేసే అధికారం వైసీపీ ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పిన విషయాన్నే సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది కనుక ఇకనైనా వైసీపీ ప్రభుత్వం బుద్ది తెచ్చుకొని అమరావతిని రాజధానిగా అంగీకరించాలని టిడిపి, జనసేనలు వాదిస్తున్నాయి.
రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి అమరావతిలో పనులు మొదలుపెట్టాలని వామపక్షనేతలు సూచించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు కూడా సోమవారం రాత్రి తమ గ్రామాలలో కొవొత్తులు వెలిగించి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించారు.
ఈవిదంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుని, విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఎవరికి అనుకూలంగా వారు అన్వయించుకొని తృప్తి పడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొంటే అమరావతి నిర్మించగలదు వద్దనుకొంటే ఆపేయగలదని, అలాగే ప్రభుత్వం తలుచుకొన్నా మూడు రాజధానులను ఏర్పాటుచేయలేదనే విషయం కూడా స్పష్టమైంది. కనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పనులు ముందుకు సాగవు… మూడు రాజధానులు ఏర్పడవనే స్పష్టమైంది.
ఎందుకంటే జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించలేకపోతున్న ప్రభుత్వం, జనవరి 30న సుప్రీంకోర్టు తదుపరి విచారణ జరిపి మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వాటిని ఏర్పాటు చేయలేదు. కానీ మూడు రాజధానుల కోసం సన్నాహాలు లేదా ఏర్పాట్లు పేరుతో డబ్బా కొట్టుకొంటూ మరో ఆరేడు నెలలు గడిపేసి ఎన్నికలకు సిద్దం అయిపోతుందే తప్ప వాటినీ ఏర్పాటు చేయదు. అంటే ప్రజలు వైసీపీకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినా రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుచేయకుండా కాలక్షేపం చేసేయబోతోందని భావించవచ్చు.
New data is showing that H-1B petitions from Indian companies in the US have dropped…
Amyaela is setting the internet ablaze with a breathtaking new photoshoot that totally redefines modern…