
ఈ కేసుపై జస్టిస్ హిమాకొహ్లీ, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుదవారం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు రుషికొండలో కొత్తగా ఏమీ చేయడం లేదని, పాత కట్టడాల స్థానంలోనే కొత్తవి కడుతున్నామని చెప్పారు.
అయితే రఘురామ సుప్రీంకోర్టు ధర్మాసనానికి సమర్పించిన తాజా గూగుల్ ఫోటోలలో కొండను మొత్తం తవ్వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని జస్టిస్, జస్టిస్ బీఆర్ గవాయి అభిప్రాయం వ్యక్తం చేయగా, పాత భవనాలను తొలగించి కొత్తవి నిర్మిస్తున్నప్పుడు మళ్ళీ డ్రాయింగులలో వేరేగా ఎందుకు కనిపిస్తున్నాయని జస్టిస్ హిమాకొహ్లీ ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసు రాష్ట్ర హైకోర్టు పరిధిలో ఉన్నందున దీనిలో గ్రీన్ ట్రిబ్యూనల్ కలుగజేసుకోరాదని ధర్మాసనం తీర్పు చెప్పింది.
అయితే హైకోర్టు దృష్టి సారించేలోగా ఏపీ ప్రభుత్వం రుషికొండను పూర్తిగా తవ్వేసి కనబడకుండా పిండి చేసేస్తుందని ఎంపీ రఘురామ న్యాయవాది సూచించడంతో, దీనిపై హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పిటిషనర్ రఘురామ వ్యక్తం చేస్తున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈ కేసుపై హైకోర్టు తక్షణం దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
అంతవరకు రుషికొండపై కొత్తగా తవ్వకాలు జరపరాదని, ఆ ప్రాంతంలో కొత్తగా ఎటువంటి కట్టడాలు నిర్మించరాదని స్పష్టం చేసింది. అయితే కొండపై కాకుండా పక్కనే ఉన్న మైదాన ప్రాంతంలో భవనాలు నిర్మించుకోవచ్చునని ధర్మాసనం సూచించింది.
రుషికొండను తవ్వరాదని, కొండపై కొత్తగా ఎటువంటి కట్టడాలు నిర్మించవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం చెపితే, సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యూనల్ స్టే ఆదేశాలను నిలిపివేయడంతో రఘురామకు ఆయన వెనక ఉండి నడిపిస్తున్న చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని సాక్షి చెప్పుకోవడం విశేషం.
కొండపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించిందని చెపుతూనే ‘కొండపై చదును చేసిన ప్రదేశం’లో కట్టడాలు నిర్మించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించిందని వక్రీకరించి చెప్పుకోవడం సిగ్గుచేటు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తున్నా అవి కూడా గొప్పగానే ఉన్నాయని చెప్పుకోవడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లు.
—
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…