
నటుడు సూర్య ఒక థియేట్రికల్ కమర్షియల్ హిట్ అందుకొని చాలా ఏళ్లవుతోంది. 2013లో వచ్చిన “సింగం 2” తర్వాత సూర్యకి ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేదు. దాదాపు 13 ఏళ్లుగా వరుసబెట్టి ఫ్లాపులు చవిచూస్తూనే ఉన్నాడు. మధ్యలో “జై భీమ్, ఆకాశం నీ హద్దురా” సినిమాలు హిట్స్ అయినా అవి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు అయిపోవడంతో వాటి సక్సెస్ ను సూర్య పూర్తిగా ఆస్వాదించలేకపోయాడు.
అలాగే.. “డ్యూడ్” సినిమాతో మ్యూజికల్ సెన్సేషన్ గా ఒక సునామీ సృష్టించిన సాయి అభ్యంకర్ నిజానికి మొదట సైన్ చేసిన సినిమా “కురుప్పు” తెలుగులో “వీరభద్రుడు”. ఆ సినిమాలోని పాటలు ఇప్పటివరకు అంతగా వైరల్ అవ్వలేదు. తమిళ వెర్షన్ పాటలకి కనీసం విడుదలయ్యాయని తెలుసు, తెలుగు వెర్షన్ పాటలైతే అసలు విడుదలయ్యాయో లేదో కూడా జనాలకి తెలియదు.
ఇప్పుడు సూర్యకి హీరోగా నిలదొక్కుకోవాలన్నా.. సాయి అభ్యంకర్ సంగీత దర్శకుడిగా తాను ఒన్ టైమ్ వండర్ కాదు అని నిరూపించుకోవాలన్నా.. “కరుప్పు” (వీరభద్రుడు) బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఒకరకంగా మే 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సూర్య & సాయికి యాసిడ్ టెస్ట్ అనే చెప్పాలి. ఈ సినిమాల రిజల్ట్ తాలూకు ఎఫెక్ట్ సూర్య తదుపరి చిత్రమైన “విశ్వనాథ్ & సన్స్” మరియు సాయి అభ్యంకర్ నెక్స్ట్ సినిమా అయిన “రాకా” మీద కూడా పడుతుంది.
మరి ఈ యాసిడ్ టెస్ట్ నుండి సూర్య & సాయిలను “కరుప్పు” దర్శకుడు ఆర్జే బాలాజీ ఏమాత్రం బయటపడేస్తాడో చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…