Telugu

“మిస్టరీ”గా మారిన హీరో సూర్య కేసు?

తమిళంతో పాటు టాలీవుడ్ లోనూ క్రేజీ హీరోగా కొనసాగుతున్న సూర్యపై నమోదైన కేసు పెద్ద ‘మిస్టరీ’గా మారింది. ఓ ఫుట్ బాల్ క్రీడాకారుడు ప్రేమ్ కుమార్ ఫిర్యాదు నేపధ్యంలో నమోదైన కేసు తర్వాత స్వయంగా ‘విత్ డ్రా’ చేసుకున్నారని సోషల్ మీడియాలో ఓ లేఖ ప్రచారంలో ఉంది. అయితే ఈ లేఖలో అసలు సూర్య పేరు లేకపోవడంతో అసలు ఈ లేఖ నిజమైనదో కాదో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

సదరు లేఖ ప్రకారం… సోమవారం సాయంత్రం ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నట్లు మాత్రమే రాసి ఉంది. ఇందులో హీరో సూర్య పేరు లేకపోవడంతో నిజంగానే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారా? లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఎవరిపై ఫిర్యాదు చేసామో వారి పేరు, ఇతర సమాచారం తెలుపకుండా ‘విత్ డ్రా’ చేసుకోవడం సాధ్యమైన విషయమేనా? అంటే ఇది ఒక ఫేక్ లేఖగా పరిగణించాలా?

ADVERTISEMENT

కాదు, ఒకవేళ అదే నిజమైన లేఖ అయితే… అసలు హీరో సూర్యపై కేసు నమోదు కాలేదా? అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. దీంతో తమిళ స్టార్ హీరో గారి కేసు ఉదంతం ఓ పెద్ద ‘మిస్టరీ’గా మారింది. బహుశా దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఎలాంటి స్పష్టత వచ్చే అవకాశం లేదు. మరి దీనికి ఎప్పుడు ‘శుభం కార్డు’ పడుతుందో అని సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

పిఠాపురం … మంగళగిరి … కుప్పం…నేతల చిత్తశుద్ధికి నిదర్శనాలా.?

రాజకీయాలలో హామీలు ఇవ్వడం సులభం. కానీ వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం మాత్రం అంత సులభం కాదు. ఎన్నికల సమయంలో నియోజకవర్గాల…

3 minutes ago

షర్మిల రీ ఎంట్రీ కోసం జగన్ ఎదురుచూస్తున్నారా.?

వైసీపీ లో షర్మిల రీ ఎంట్రీ, అన్న చెల్లెళ్ళ మధ్య పంచాయితీకి ఎండ్ కార్డు పడింది, వైఎస్ కుటుంబం తిరిగి…

35 minutes ago