
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న “జనతా గ్యారేజ్” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 30 శాతం చిత్రీకరణ పూర్తి కావడంతో ముందుగా ప్రకటించిన ఆగష్టు 12వ తేదీన ఖచ్చితంగా విడుదల అవుతుందని అభిమానులకు నమ్మకం పెరిగింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కధకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ మెకానిక్ పాత్రలో నటిస్తున్నారన్న విషయం తప్ప, ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు.
కానీ, తాజాగా “24” సినిమా ఆడియో వేడుకపై తమిళ హీరో సూర్య చేసిన పలు వ్యాఖ్యలు ‘జనతా గ్యారేజ్’పై అంచనాలు పెంచాయి. ‘24’ ఆడియో వేడుకకు హాజరైన దర్శకుడు కొరటాల శివను ప్రస్తావించిన సమయంలో… ‘జనతా గ్యారేజ్’ సినిమా గురించి తనకు తెలుసని, ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని సూర్య చేసిన వ్యాఖ్యలతో జూనియర్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ మాటలతో ఆడిటోరియం అంతా సినీ అభిమానుల ఈలలు, చప్పట్లతో మారుమ్రోగింది.
After being a crucial member in the team of former CM YS Jagan for more…
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…