
స్వర భాస్కర్ విషయానికి వస్తే, “సినిమా షూటింగ్ లు జరిగే సెట్లలో ఫ్యూడల్ భావాలుంటాయి. కొందరు ఆదేశిస్తుంటే మిగతావారంతా వాటిని వినాల్సిందే. లైంగిక వేధింపుల విషయమూ అంతే. ఫలానా చోటికి వెళ్లాలంటే వెళ్లాల్సిందే. ఈ విషయంలో బాధితులు నోరు మెదపకుండా ఉంటారన్న సంగతి అక్కడున్న అందరికీ తెలుసు. ఈవ్ టీజింగ్ సర్వసాధారణం. నేను కెరీర్ తొలినాళ్లలో ఉన్నవేళ జరిగిన సంగతి ఇది.
ఓ చిత్రంలో నటించేందుకు 56 రోజుల పాటు అవుట్ డోర్ లో ఉండాల్సి వచ్చింది. నాకు ఈ వాతావరణమే కొత్త. చిత్ర దర్శకుడు డిన్నర్ కు రావాలని నన్ను వేధించాడు. రోజంతా నటించడం లేదని తిడుతూ, రాత్రయ్యేసరికి రమ్మని పిలుస్తుండేవాడు. సీన్ గురించి మాట్లాడాలని చెబుతూ మద్యం తాగి వచ్చేవాడు. షూటింగ్ మొదలైన వారం రోజుల వ్యవధిలోనే ప్రేమ, సెక్స్ గురించి మాట్లాడేవాడు. రాత్రయితే నా గదికి వచ్చి కౌగిలించుకోవాలని అడిగేవాడు. చాలా భయం వేసేది.
నేను ఒంటరిగా ఉండటంతో ఇంకా ఎక్కువగా భయపడుతుండేదాన్ని. గదిలో లైట్లన్నీ ఆర్పివేసి, చీకట్లోనే మేకప్ తీసేస్తూ ఉండేదాన్ని. గదిలో లైట్లు లేకుంటే, నిద్రపోతున్నానేమోనని అతను రాకుండా ఉంటాడని అనుకునేదాన్ని. ఆ తరువాత అతనికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కు విషయం చెప్పగా, నాకు ఎస్కార్ట్ కల్పించారు. అప్పటితో ఆ బాధ కొంత తగ్గింది” అని చెప్పుకొచ్చింది. వేధింపులు ఎదురైతే, ఎదురు నిలిచి పోరాడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి వలలో పడి లొంగ వద్దని సలహా ఇస్తోంది.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…
Ram Charan and Sukumar’s new film #RC17 was officially launched with a pooja ceremony attended…