
జైలులో వేలాది మంది ఖైదీలు, గస్తీ సిబ్బంది ఉండగా రామ్‌కుమార్ కరెంటు వైర్లను కొరికి ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, పథకం ప్రకారమే అతడిని చంపేశారని ఆరోపిస్తున్న అతడి తండ్రి పరమశివం… రామ్‌కుమార్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాతే కుమారుడి మృతదేహాన్ని తీసుకుంటానని భీష్మించుకున్నారు. దీంతో ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించడంతో పోలీసులు ఇరుకునపడ్డారు.
మరోవైపు నిందితుడి మృతదేహానికి పోస్టుమార్టంపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో జరగాల్సిన పోస్టుమార్టం నిలిచిపోయింది. ఆస్పత్రికి రామ్‌కుమార్ బంధువులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రామ్‌కుమార్ ఆత్మహత్యపై ప్రతిపక్షాలు కూడా భగ్గుమంటున్నాయి. అతడి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డీఎంకే అధినేత కరుణానిధి డిమాండ్ చేశారు. దీంతో రామ్ కుమార్ ఆత్మహత్య ఇప్పుడు పోలీసుల మెడకు ఉచ్చుగా మారి, ప్రభుత్వానికి పోలీసులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…