
ఇదే సమయంలో స్విస్ ప్రభుత్వానికి ప్యానల్ కొన్ని సూచనలు చేసింది. సమాచార మార్పిడికి ఆమోదం తెలుపుతూనే, ఖాతాదారుల వ్యక్తిగత రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయాలని సూచించింది. సమాచార మార్పిడి నేపథ్యంలో, ఎక్కడా చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలని తెలిపింది. నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న స్విస్ పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం పలకనున్నారు.
ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే… స్విస్ బ్యాంక్ ఖాతాదారుల పేర్లు, చిరునామా, ఖాతా నంబరు, పుట్టిన తేదీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ తదితర వివరాలను సంబంధిత దేశాలతో పంచుకునే అవకాశం స్విస్ కు లభిస్తుంది. భారత్-స్విట్జర్లాండ్ ల మధ్య ఈ ఒప్పందం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుండగా… 2019లో తొలి సమాచార మార్పిడి జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. తాము పంచుకునే సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలని భారత్ తో సహా ఇతర దేశాలకు స్విట్జర్లాండ్ ఇప్పటికే స్పష్టం చేసింది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…