Telugu

చిరంజీవి కోరిక సగం తీరింది… మిగిలిన సగం తీరుతుందా?

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం, సైరా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుంది. రేపు ఒక మేకింగ్ వీడియో విడుదలతో టీం తమ ప్రమోషన్స్ మొదలు పెడుతుంది. తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న ఈ సినిమా ఎప్పటి నుండో చిరంజీవి డ్రీం ప్రాజెక్టు. ఈ సినిమా మొదలుపెట్టిన నాటి నుండీ చిరంజీవికి దీనిని బాహుబలి స్టైల్ లో విడుదల చెయ్యాలని ప్రమోట్ చెయ్యాలని కోరికగా ఉన్నారు.

హిందీలో సినిమాను ప్రమోట్ చెయ్యడానికి గానూ అమితాబ్ బచ్చన్ తో ఒక చిన్న పాత్ర చేశారు. అయినా సినిమాకు పెద్దగా హైప్ రాలేదు. అలాగే చాలా కాలంగా ఈ సినిమాకు హిందీలో బయర్స్ దొరకలేదు. సినిమా విడుదల దగ్గర పడుతున్నా బయర్లు రాకపోవడంతో పూర్తి నిరాశగా ఉన్నారు. ఈ తరుణంలో సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. అమిత్ తడాని, ఫర్హాన్ అక్తర్ ఈ సినిమా హిందీ రైట్స్ ను చేజిక్కించున్నారు. ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని మార్కెట్ చెయ్యబోతున్నారు.

ADVERTISEMENT

గతంలో వీరిద్దరూ కేజిఫ్ ను హిందీలో ఇలాగే విడుదల చేశారు. దీనితో సినిమాకు అక్కడ మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది. సినిమాకు ప్రమోషన్స్ కూడా బాలీవుడ్ లో భారీ గా చెయ్యబోతున్నారు. అయితే బాహుబలి స్థాయిలో కాకపోయినా కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో అక్కడ కూడా ఆడితేనే చిరంజీవి కోరిక పూర్తిగా తీరినట్టు. తొందరలో ముంబై లో ఒక భారీ ఈవెంట్ లో సినిమా హిందీ ట్రైలర్ విడుదల చెయ్యడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

418 Reaches Breakeven in 2 Days

The team of 418 expressed happiness over the response to the film, with producers Naveen…

24 minutes ago

ఏబీవీ టార్గెట్: తాను గెలవడమా.. వైసీపీని గెలిపించడమా?

గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర రావు (ఏబీవీ), 5 ఏళ్ళు జగన్‌ ప్రభుత్వం…

28 minutes ago