
ఈ టి-20 ప్రపంచ కప్ ఆరంభానికి ముందు ఒక వరల్డ్ కప్ లో 20 జట్లు పాల్గొనటం ఏంటి అని ప్రశ్నించిన వారు చాలా మంది ఉన్నారు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు ఆఫ్రికా వంటి జట్లు ఉండగా చిన్న జట్ల ఎంపిక కు అర్థమేముంటుందనుకున్నారు అందరు.
కానీ, చిన్న జట్లు ఈ ప్రపంచ కప్ కు పెద్ద కలలు కంటూ వచ్చినట్టున్నాయి. శ్రీలంక, జింబాబ్వే, ఆఫ్గనిస్తాన్, నేపాల్, ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్ వంటి జట్లు తమ నుండి ఆశించిన స్థాయి కంటే చాలా మంచి క్రికెట్ ఆడారనే చెప్పచ్చు. విండీస్ జట్టు సూపర్-8 కు అర్హత సాధించగలదా అనే ప్రశ్నకు ధీటైన బదులిచ్చింది ఆ జట్టు.
సూపర్-8 క్వాలిఫికేషన్ పై సందేహాలున్న జట్టుగా బరిలోకి దిగి ఎదుర్కున్న ప్రతి జట్టును చిత్తు చేస్తూ విండీస్ జట్టు సూపర్-8 కు ఘనంగా చేరుకున్నారు.హోప్, రుదర్ఫర్డ్, పావెల్, హెట్మయర్ వంటి బ్యాటర్లకు హోల్డర్, హుసైన్ వంటి బౌలర్ల తోడ్పాటు ఆ జట్టుకు బాగా ఉపయోగపడింది.
ఇక, గ్రూప్-బి నుండి ఈ టి-20 వరల్డ్ కప్ కె బిగ్గెస్ట్ షాక్ కొలువై ఉంది. ఆస్ట్రేలియా జట్టు బిలాటరల్ సిరీస్ ల లో ఎలా ప్రదర్శించినప్పటికీ, వరల్డ్ కప్ అంటేనే రెచ్చిపోతుందనే మాట తరచుగా వింటుంటాం. కానీ, ఈసారి ఆసీస్ జింబాబ్వే మరియు లంక జట్ల పై ఓడి మరువలేని అవమానాన్ని చవిచూడక తప్పలేదు.
మరో పక్క, అదే గ్రూప్-బి లో జింబాబ్వే మరియు శ్రీలంక జట్లు ఎవ్వరు ఊహించని రీతిలో తమ ఆధిపత్యాన్ని చూపారు. జింబాబ్వే కంగారూలను కంగారు పెడుతూ మ్యాచ్ ను లాగేసుకోగా, మరో పక్క శ్రీలంక ఆసీస్ యొక్క సూపర్-8 ఆశలను సమాధి చేస్తూ ఈ ఇరు జట్లు సూపర్-8 కు దూసుకెళ్లాయి.
ఇక ఆఫ్గనిస్తాన్, అమెరికా మరియు నేపాల్ జట్లు అభిమానులను ఊరించినప్పటికీ సూపర్-8 కు అర్హత సాధించటంలో విఫలమయ్యాయి. నేపాల్ జట్టు ఇంగ్లాండ్ ను ముప్పుతిప్పలు పెడుతూ మ్యాచ్ ను సుమారు గెలిచే స్థాయికి వెళ్లిపోయారు. ఇక, ఆఫ్ఘన్ జట్టు ఆఫ్రికా ను బోల్తా కొడుతుందనుకున్న మ్యాచ్లో ఆఫ్రికా జట్టు తమ అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్ ను ఆఫ్ఘన్ నుండి లాగేసుకున్నారు.
అయితే, పైన ప్రస్తావించిన జట్లన్నీ ఎప్పుడోకప్పుడు తమ సామర్ధ్యాన్ని చాటి.. ముందు వరల్డ్ కప్లలో పెద్ద జట్లకు ఝలక్ ఇచ్చారు. కానీ, ఈ వరల్డ్ కప్ లో ఇటలీ ఆటతీరు ఎందరో అభిమానులను ఆకట్టుకుంది. నేపాల్ వంటి గట్టి జట్టు పై ఏకంగా 10 వికెట్ల తేడాతో నెగ్గి, ఇంగ్లాండ్ కు కూడా చమటలు పట్టించింది ఈ జట్టు.
వచ్చే టి-20 వరల్డ్ కప్ లోపు ఇటలీ జట్టుకు అగ్ర దేశాలతో మ్యాచ్లను షెడ్యూల్ చేయాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ కోరికలను చెప్పుకుంటున్నారు. ఈ 2026 టి-20 వరల్డ్ కప్ కు ముందు వచ్చిన ప్రశ్నలన్నిటికీ లీగ్ స్టేజితోనే సమాధానాలొచ్చేశాయి, మరి సూపర్-8 మరియు ప్లే-ఆప్స్ ఇంకా ఏ రేంజ్ ఉత్కంఠ ను కలిగి ఉంటాయో చూడాలి..!
Telugu cinema is facing a quiet but noticeable problem. Everything is starting to sound the…
Royal Challengers Bengaluru defeated Delhi Capitals in the 39th match of IPL 2026 at the…