
తను తెలుగులో నటించిన మొదటి సినిమాలో చిత్ర దర్శకుడు దృష్టంతా నా బొడ్డు మీదే ఉందని, ఆ సినిమా షూటింగ్ పాటతో ప్రారంభించారని, ఆ దర్శకుడు ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే… గతంలో జయసుధ, శ్రీదేవి వంటి హీరోయిన్లను స్టార్లను చేసారని, వాళ్ళ బొడ్డుపై వివిధ రకాలైన పండ్లు వేసి కొట్టడం సదరు దర్శకుడికి అలవాటని, శ్రీదేవి బొడ్డుపై పండ్లతో కొట్టిన కొన్ని వీడియోలను తాను చూశానని, నిజానికి తాను అప్పుడు అలాంటి వాటికి సిద్ధంగా లేనని చెప్పుకొచ్చింది.
ఇక, తన బొడ్డుపై మాత్రం కొబ్బరికాయ కొట్టారని, అలాగే కొబ్బరికాయ చిప్పలో నుండి తనను పైకి తీసారని అవహేళనగా చెప్తూ పగలబడి నవ్వింది. ఈ సందర్భంగా ఆ పాట వీడియోను కూడా ప్రదర్శించడం విశేషం. ఇక పక్కనే ఉన్న మరొక వ్యక్తి మాట్లాడుతూ… అసలు బొడ్డులో సెక్సీతనం ఏముంటుంది..? ఏదో రెండు ఇంచ్ లు పైనో లేక రెండు ఇంచ్ లు కిందో అయితే ఉంటుంది గానీ అని చెప్పడం… దానికి ఏ మాత్రం సిగ్గుపడకుండా తాప్సీతో సహా అక్కడున్న వారంతా పగలబడి నవ్వడం జరిగింది.
టాలీవుడ్ సుప్రసిద్ధ దర్శకుడిని కించపరిచే విధంగా ఉన్న ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు తాప్సీని ఏకిపారేస్తున్నారు. మొదట అవకాశం కల్పించి, ఈ రోజు ఇంతటి గుర్తింపు రావడానికి కారణమైన రాఘవేంద్రరావును హేళన చేసే కుసంస్కారిగా తాప్సీని అభివర్ణిస్తూ మండిపడుతున్నారు. నాడు ఆ పూలు, పండ్లే ఈనాడు నువ్వు ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం అని గుర్తు చేస్తున్నారు. అయితే దీనిపైన టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదే కోలీవుడ్ అయితే… ఈ పాటికి తాప్సీ నోట ‘క్షమాపణలు’ అన్న మాట కూడా వచ్చేసి ఉండేది అని చెప్పడంలో సందేహం లేదేమో!
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…