తమన్నాకు అన్ని రకాలుగా పనైంది

Tamanna-Bhatia-Andhadhun remakeనితిన్ చెయ్యబోతున్న అంధాదున్ తెలుగు రీమేక్ కోసం టబు క్యారెక్టర్ కు మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనల్ చేసింది ఆ చిత్ర బృందం. టబు అదరగొట్టిన పాత్రకు తమన్నా ఏ మాత్రం న్యాయం చెయ్యగలదు అనే అనుమానాలు అందరిలోనూ ఉంది. ఎందుకంటే తమన్నా ఇంతకు ముందు నెగటివ్ పాత్ర చేసింది లేదు. పైగా మాములుగా కూడా తమన్నా పెద్ద నటీ ఏమీ కాదు.

ADVERTISEMENT

అయితే ఛాలెంజింగ్ పాత్రతో పాటు ఈ సినిమాకు తమన్నాకు బానే కిట్టుబాటు అయ్యిందట. ఈ సినిమాకోసం ఆమెకు కోటిన్నర రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఈ మధ్య కాలంలో ఆమెకు దక్కిన అతిపెద్ద రెమ్యూనరేషన్ అమౌంట్ ఇదే. దానితో అన్ని రకాలుగానూ తమన్నాకు వర్క్ అవుట్ అయినట్టు అయ్యింది.

నితిన్ తన రంగ్ దే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా మొదలుపెడతాడు. నవంబర్ నాటికి షూటింగ్ మొదలవుతుంది. రాధికా ఆప్టే పోషించిన పాత్రకు న‌భా న‌టేష్ ఎంపికైంది.* శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 6గా త‌యార‌య్యే ఈ చిత్రాన్ని ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తుండ‌గా, ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్పిస్తున్నారు.

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ లో వచ్చిన అతితక్కువ హిట్లలో నితిన్ భీష్మ ఒకటి. దానితో ఈ యువహీరో తన ఇతర ప్రాజెక్టులతో కూడా సక్సెస్ ని కంటిన్యూ చెయ్యాలని అనుకుంటున్నాడు.

ADVERTISEMENT
Latest Stories