
వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ ఈరోజు విడుదలయ్యి మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఒక దారుణ హత్య కేసులో ఇరుకున్న తన తండ్రి ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నిస్తున్న ఒక కుమార్తె కథ నవంబర్ స్టోరీ. వెబ్ సిరీస్ కు ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో అంచనాలు పెరిగాయి.
ఈ మధ్య తెలుగు హీరోయిన్లు డిజిటల్ వైపు చూస్తున్నారు. పాయల్ రాజపుత్, కాజల్ అగర్వాల్ తమ అదృష్టాన్ని ఇప్పటికే పరీక్షించుకుని భంగపడ్డారు. అయితే సమంత చేస్తున్న ది ఫ్యామిలీ మాన్ 2 పైనే అందరి చూపు ఉంది. ఆ వెబ్ సిరీస్ మొదటి పార్ట్ అతిపెద్ద హిట్. సెకండ్ పార్ట్ లోని సమంత క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు.
ఆ సిరీస్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల అవ్వాల్సి ఉండగా చివరి నిముషంలో వాయిదా పడింది. ఈ వేసవిలోనే విడుదల అవుతుందని సమాచారం. ఒకవేళ నవంబర్ స్టోరీ హిట్ అయితే ఆ లోగానే సమంత కు తమన్నా టార్గెట్ సెట్ చేసినట్టు అవుతుంది.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…