Telugu

‘భరత్ అనే నేను’పై స్పందించిన టాప్ హీరోయిన్!

‘బాహుబలి 1’ తర్వాత యువకుల కలలరాణిగా మారిన మిల్కీ బ్యూటీ తమన్నా, చేతిలో ప్రస్తుతం బోలెడు టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. ఓ పక్కన సినిమాలతో పాటు మరో పక్కన బ్రాండ్ అంబాసిడర్ గానూ, రిబ్బన్ కటింగ్ వ్యవహారాలలోనూ చురుకుగా పాల్గొంటున్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా ప్రొద్దుటూరును సందర్శించింది.

బి న్యూ అనే మొబైల్ షో రూమ్ నూత బ్రాంచ్ ఓపెన్ చేయడానికి విచ్చేసిన ఈ అందాల బొమ్మను వీక్షించడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించిన తమన్నా, తన తదుపరి చిత్రాల గురించి అభిమానులతో పంచుకుంది. అలాగే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబు ఇచ్చింది.

ADVERTISEMENT

‘సైరా’ సినిమాలో తాను ఓ కీలక పాత్ర చేయబోతున్నానని ధృవీకరించిన తమన్నా, త్వరలోనే ‘నా నువ్వే’ సినిమా విడుదల కానుందని చెప్పుకొచ్చింది. అలాగే సందీప్ కిషన్ తో ఓ సినిమా చేస్తున్నానని, ‘ఎఫ్ 2’లో కూడా నటిస్తున్నానని స్పష్టం చేసింది. తనకు మహేష్ అంటే ఇష్టమని, ‘భరత్ అనే నేను’ చూశానని, తనకు నచ్చిందని ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబిచ్చింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Varun-Janhvi’s Episode: More Secrets, Less Substance?

The third episode of Koffee With Karan Season 9 is out now. It features Varun…

2 minutes ago

Aadarsha Kutumbam (AK 47) Review: A Safe Family Watch

BOTTOM LINE A Safe Family Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Trivikram Srinivas Cast: Venkatesh,…

24 minutes ago