Telugu

‘మాస్’కు మాంచి ‘ఐటెం’ నెంబర్!

జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే మాస్ స్టెప్పులు లేకుండా ఊహించుకోవడం అసాధ్యం కదా! అవును… ‘జై లవకుశ’ సినిమాలో అలాంటి మాస్ పాట కోసం ఎదురుచూసిన వారికి ఫీస్ట్ లా మారింది తమన్నా ఐటెం సాంగ్. ‘స్వింగ్ జర’ అంటూ ఈ సాగిన ఈ పాటలో మిల్కీ బ్యూటీ సౌందర్యంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు బి,సి సెంటర్స్ లో ఊపేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT

మాస్ వర్గాల్లో మాంచి పట్టు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ పాట ఒక రేంజ్ లో ఎక్కేస్తుందని సినిమా విడుదలైన తర్వాత తేలింది. నిజానికి ఆడియో పరంగా ఈ పాట గొప్పగా లేకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు, తమన్నా సోయగాల చిత్రీకరణతో మరో స్థాయికి తీసుకువెళ్ళారు. ఈ పాట తర్వాత సినిమాలో విజువల్ గా ‘ట్రింగ్ ట్రింగ్’ పాట చూడముచ్చటగా ఉంటుంది.

‘జనతా గ్యారేజ్’లోని ‘యాపిల్ బ్యూటీ’ మాదిరి కనపడే ‘ట్రింగ్ ట్రింగ్’ పాటలో కోరియోగ్రఫీ బాగుంటుంది. దానికి తారక్, రాశి ఖన్నాల ఫ్రెష్ నెస్ యాడ్ అయ్యింది. ఇక ఆడియోలో హైలైట్ అయిన ‘రావణా…’ పాట టీజర్లో చూపించిన విధంగానే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చి వెళ్ళిపోతుంది. నివేదా థామస్, కుశ ఇంట్రడక్షన్ సాంగ్స్ రెగ్యులర్… వీటి గురించి చెప్పుకోవడానికేం లేదు. విజువల్ గా పాటల్లో హైలైట్స్ అంటే… స్వింగ్ జరా అండ్ ట్రింగ్ ట్రింగ్!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas, Yash Ran Away from Clash & Still Got Destroyed?

There is a strange coincidence surrounding Raja Saab and Toxic. Both Prabhas and Yash were…

7 minutes ago

యష్‌తో ఆదిత్య ధర్ కలిస్తే… వర్మ పరిస్థితేంటి?

ధురంధర్‌కు రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటర్వ్యూలు, ట్వీట్లతో ఆ సినిమాను, దర్శకుడు ఆదిత్య…

10 minutes ago