
నయనతార ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భార్య సిద్ధమ్మ, తమన్నా ఆయన ప్రియురాలు లక్ష్మీగా నటించారు. సహజంగా నయనతార మెయిన్ కావలి. అయితే ఆమెకు కొంత మేరే స్క్రీన్ స్పేస్ దక్కింది. ఉన్నదాంట్లో పర్వాలేదు అనిపించింది. తమన్నా సెకండ్ హీరోయిన్ అయినా మంచి విషయం ఉన్న పాత్ర నటించింది.
సైరా టైటిల్ సాంగ్ లో డాన్స్, చివరిలో ఆత్మ బలిదానం చేసుకునే సమయంలో ఫైర్ డాన్స్ ఆకట్టుకునేలా ఉంది. తమన్నా కేరీర్ కు ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా మేలు చేసేదే. మరోవైపు నయనతార డేట్స్ దొరకడంలోని ఇబ్బంది వల్ల ఆమె పాత్రను కుదించారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా కొందరు ఇంకో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అసలు చరిత్రని బట్టి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి భార్య సిద్ధమ్మ ఆయన ఆంగ్లేయులకు దొరక్క ముందే చనిపోయారట. అయితే నరసింహా రెడ్డి చనిపోయాకా కూడా ఆమె బ్రతికే ఉన్నట్టు సినిమాలో చూపించారు. ఇది ఇలా ఉండగా సైరా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అన్ని భాషలలో కలిపి 200 కోట్లు షేర్ రాబడితేనే సినిమా హిట్ గా పరిగణించవచ్చు. టాక్ బావుండడంతో మెగా ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.
Prabhas turned a casual conversation with Prashanth Neel into a fun moment, and fans got…
Ayushmann Khurrana and Sara Ali Khan’s Udta Teer has arrived in theatres on October 23,…