
[m9ad]
నిత్యం చంద్రబాబుపై విమర్శలు చేస్తోన్న హరీష్ రావు అండ్ కో, ఆ ఫ్లోలో చంద్రబాబు నాయుడుని తెలంగాణా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా చేసేసారు. ‘మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు’ అంటూ ప్రస్తావించిన హరీష్ రావు, అనంతరం తన పొరపాటును సవరించుకుని ‘మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు’ అంటూ సవరించుకున్నారు. కానీ మీడియాలో ఇది రికార్డ్ కావడంతో, నెటిజన్లు, తెలుగు తమ్ముళ్ళు ఈ వీడియోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.
ఇప్పటికే జగన్ అక్రమాస్తులు, వివేక హత్య కేసులలో ఈడీ విచారణ జోరు పెంచింది. తాజాగా నాడు సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలు,…
ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన జగన్మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం.…