
ఈ బడ్జెట్ ప్రతిపాదనల్లో నాటకీయ నిర్ణయాలు చోటు చేసుకోవచ్చని, భారత ఆర్థిక వ్యవస్థలో నగదు కొరత ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ఎవరూ ఊహించని నిర్ణయాలను కేంద్రం తీసుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ట్రాన్సాక్షన్ టాక్స్ తో పాటు, డెరివేటివ్ లావాదేవీలు, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నులను కేంద్రం కొత్తగా వేయవచ్చని అనలిస్టులు భావిస్తున్నారు. అదే జరిగితే, గతంలో స్థిర, చరాస్తులు లేదా కంపెనీలో షేర్లు తదితర ఆస్తులను అమ్మి, ఆపై ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి లాభపడి, ఇప్పుడు వాటిని అమ్మే వారిపైనా పన్ను భారం పడ్డట్టే.
ఇక మరో మూడు నాలుగు నెలల్లో జీఎస్టీ అమలు కానున్న నేపథ్యంలో, పలు కొత్త నిబంధనలనూ విధిస్తూ కేంద్రం నిర్ణయాలు తీసుకోవచ్చని, ‘పరోక్ష బదలాయింపు’ పేరిట కొత్త పన్నులను కేంద్రం ప్రజలపై మోపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే డబ్బులపై కేంద్రం కన్నేసిందని, వివిధ దేశాల నుంచి తమ వారికి వచ్చే నిధులపై పన్నులను వసూలు చేయవచ్చని తెలిపారు. అలాగే ఒక పక్కన నగదు రహితం అంటూ ప్రోత్సహిస్తూ, మరో పక్కన ఆన్ లైన్ లావాదేవీలపై పన్నులంటే సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడం తధ్యం అంటున్నారు విశ్లేషకులు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…