
[m9ad]
తన సినిమాను ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో సరిగ్గా తెలిసిన విజయ్ దేవరకొండ, అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ పైన దృష్టి పెట్టాడు. నిజానికి తన గత చిత్రాలు ‘గీత గోవిందం’ నోటా’ సినిమాలతో పోలిస్తే, ‘టాక్సీవాలా’కు మీడియా ప్రమోషన్స్ చాలా తక్కువగా ఉండగా, పైరసీ పుణ్యమా అంటూ అది సినిమా ప్రచారానికి దోహదపడింది. ముందు రిలీజ్ కాబోయే రవితేజ ‘అమర్ అక్బర్ అంటోనీ’ కంటే ‘టాక్సీవాలా’ పైనే బజ్ ఎక్కువగా వినపడుతోంది.
అయితే ఈ రెండు సినిమాల ఆడియన్స్ టార్గెట్ వేర్వేరు కావడం ప్లస్ పాయింట్. మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుంటూ రవితేజ వస్తుండగా, యూత్ ప్రేక్షకులనే నమ్ముకుని విజయ్ దేవరకొండ రానున్నాడు. అందుకే ఓపెనింగ్స్ విషయంలో ‘టాక్సీవాలా’ ఒక మెట్టు పైనున్నాడు. విజయ్ గత చిత్రం ‘నోటా’ మొదటి రోజు మంచి వసూళ్ళనే సాధించినప్పటికీ, ఆ తర్వాత నిలబడలేక చతికిలపడడంతో, ‘టాక్సీవాలా’ వసూళ్ళపై ట్రేడ్ వర్గాలు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి.
A US visa applicant recently took to Reddit to share their experience with the visa…
Following the back to back failures of Idli Kadai and Kara, Dhanush is all set…