
అక్టోబరు 13న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రవలిక ప్రతిభా పురస్కారం ప్రశంసాపత్రం, 20 వేల డీడీ అందుకుంది. ఆ డీడీలో నామకల్లు ప్రవలిలక బదులు హారిక అనే పేరు ఉంది. దీంతో ఆ పేరును సరిచేసే క్రమంలో హైదరాబాద్‌లోని సిండికేట్ బ్యాంకు సిబ్బంది హారిక పేరు కనిపించకుండా దానిపై బ్యాంక్ సీల్ వేశారు. ఈ విషయం తెలియని ప్రవలిక, హిందూపురం ఆంధ్రాబ్యాంక్‌లో ఆ డీడీని తన అకౌంట్‌లో జమచేసేందుకు వెళ్లింది. దానిని పరిశీలించిన బ్యాంకు సిబ్బంది, నిబంధనల ప్రకారం డీడీ చెల్లదని తేల్చి చెప్పారు.
హైదరాబాద్ వెళ్లి డీడీ జారీ చేసిన బ్యాంకు సిబ్బందితో మరో సీల్ వేయించుకురావాలని, లేదంటే మరో డీడీ తీసుకురావాలని చెప్పడంతో ప్రవలిక ఆనందం ఆవిరైంది. ఇప్పుడు దీని కోసం హైదరాబాద్ వెళ్లాలా? వద్దా? అనే మీమాంసలో పడింది. ఈ విషయంలో అధికారులు స్పందిస్తారో? లేదో? వేచి చూడాల్సిందే. అయితే దీనిని అదునుగా చేసుకున్న సిఎం ప్రత్యర్ధి మీడియా వర్గాలు ‘సిఎం ఇచ్చిన చెక్కు చెల్లలేదు’ అంటూ ఓ రకమైన దుష్ప్రచారానికి తెరలేపారు. సిఎంపై రొటీన్ గా చేసే ప్రచారమే అయినప్పటికీ, ఇందులో ఒక విద్యార్థి ఆశ, ఆనందం కూడా ఉందన్న విజ్ఞతను మరిచి మరీ ప్రచారం చేయడం విస్తుగోలిపే విషయం.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…