
చంద్రబాబుకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ లో ఆయనకు విషెస్ తెలిపారు. “ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలని. ఎక్కువ కాలం ప్రజా సేవలో గడాపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ వెళ్లారు. సతీసమేతంగా రామోజీ రావు మనవరాల వివాహానికి హాజరయ్యారు. అక్కడి నుంచి సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతిలోని కోటకొమ్మలవీధిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, రోహిత్ తదితరులు పాల్గొంటారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు పుట్టినరోజు వేడుకులు జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకుంటున్నారు.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…