
గౌతు శిరీష హాస్పిటల్ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ, “మా చిన్నప్పుడు కడప జిల్లాలో ఇలా పరస్పరం దాడులు చేసుకొనేవారని విన్నాను. కానీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడప ఫ్యాక్షనిజం పలాస వరకు విస్తరించిందని ఈ ఘటనతో రుజువైంది. పశువులశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మా పార్టీ నేత లక్ష్మణరావుపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే, “నువ్వు మంత్రిగా ఉన్నావు… మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేయడం ఎందుకు? విచారణ జరిపించవచ్చు కదా? నాపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపించవచ్చు కదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకొన్నారు?” అంటూ ప్రతిసవాల్ విసిరారు.
అప్పుడు మంత్రి సీదిరి ఆ సవాలును స్వీకరించి విచారణ జరిపిస్తే బాగుండేది. కానీ తన గూండాలతో లక్ష్మణరావుపై ఈవిదంగా దాడి చేయించారు. సమయానికి స్థానికులు అక్కడకి చేరుకోలేకపోయుంటే వాళ్ళు లక్షణరావుని హత్య చేసేవారే. తనపై దాడి చేసినవారిలో వైసీపీ నేత నర్తు నరేంద్ర తమ్ముడు నట్టు ప్రేమ్ ఉన్నాడని లక్షణరావు స్వయంగా చెపుతున్నా పోలీసులు ఆయన మాట పట్టించుకోకుండా నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పడం చూస్తే వారి దర్యాప్తు ఏవిదంగా జరుగబోతోందో అర్దం అవుతోంది. లక్ష్మణరావుపై దాడి చేసిన వైసీపీ గూండాలని పోలీసులు తక్షణం అరెస్ట్ చేయకపోతే నేను న్యాయపోరాటం మొదలుపెడతాను,” అని గౌతు శిరీష హెచ్చరించారు.
Sara Ali Khan brings a burst of sunshine to traditional Indian fashion in a vibrant…
South Indian cinema has historically been aligned with commercial format of filmmaking, and this is…