
అన్నమయ్య జిల్లాలోనే వీరబల్లి మండలం టిడిపి అధ్యక్షుడు ముద్దులూరి భానుగోపాల్ రాజు అధ్వర్యంలో మంగళవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన టిడిపి నేతలు, కార్యకర్తలతో కలిసి తాటిగుంటపల్లె పంచాయతీ పరిధిలో రెడ్డివారిపల్లె, పాపిరెడ్డిగారి పల్లె, ఎస్సీ కాలనీలలో ఇంటింటికీ తిరిగి జగన్మాయ పేరుతో ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టి సామాన్య ప్రజలను జగన్ ప్రభుత్వం ఏవిదంగా మోసం చేస్తోందో వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రాజు, మండల కమిటీ ఉపాధ్యక్షుడు దుర్గం ఆంజనేయులు, మాజీ సర్పంచ్ నేతి వెంకట్రమణ, గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రభాకర్, స్థానిక టిడిపి నాయకులు వర్ల ఆంజనేయులు, సిద్ధిరాజు, మల్లికార్జున, నాగప్ప నాయుడు, రవిరాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…