
ఇంతకీ విషయానికి.., వస్తే ఈ వివాదం పై అనిత మాట్లాడుతూ…ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల వరకే పరిమితమవుతాయేమో అంటూ జనసేన అధినేత పవన్ కు మద్దతుగా వ్యాఖ్యానించారు. గతంలోనూ ఇదేమాదిరి పవన్ సినిమా విడుదల ముందు తగ్గిన టికెట్ రేట్లు.., ఆ తరువాత విడుదలైన సినిమాలకు ఏవిధంగా అయితే పెరిగాయో అదేవిధంగా ఈ ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం కూడా సెప్టెంబర్ 2 తరువాత జగన్ ఎత్తేస్తారేమో అంటూ తన సోషల్ మీడియాలో స్పందించారు.
అయితే ఇప్పటికే పవన్ పుట్టినరోజు వేడుకలకు వారి అభిమానులు సిద్ధం చేసిన ఫ్లెక్సీలు రోడ్ల మీద కనిపించకుండా ఉండడానికే జగన్ ఈ ఫ్లెక్సీల నిషేధం అంశం తెర మీదకు తీసుకువచ్చారనేది ఆవ్యాఖ్యల సారాంశం. అయితే ఈ మాటలే టీడీపీ పార్టీ అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. చంద్రబాబు కుప్పం పర్యటనలో అధికార వైసీపీ చేసిన అరాచకాల పై కనీస స్పందన కూడా ఇవ్వని పవన్ పై మీ అత్యుత్సహం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ దాష్టికాలు.., పేదవాడికి పట్టెడన్నం పెడుతున్న అన్న కాంటీన్ల ధ్వంసం..,ఇలా టీడీపీకి నేతలకు జరిగిన అన్యాయాల గురించి ఎన్నడు నోరుమెదపని పవన్ గురించి మీకెందుకు ఇంత ఆత్రం అంటూ అనిత చేసిన ట్వీటీకు ప్రతిస్పందన కాస్త గట్టిగానే వస్తుంది. ఇదే విషయమై గతంలో చంద్రబాబు చేసిన “వన్ సైడ్ లవ్” వ్యాఖ్యలను కూడా తెలుగు తమ్ముళ్లు గుర్తుచేసుకుంటున్నారు.
అయితే ఇరు పార్టీ అధినేతలు ఒక తీరుగా ఆలోచిస్తుంటే ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం మరో విధంగా ఆలోచించడం చూస్తుంటే రానున్న రోజులలో రాష్ట్ర పరిస్థితులు ఏవిధంగా మారతాయో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అధికార వైసీపీని గద్దెదింపడానికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అంటూ జనసేన అధినేత పవన్ వ్యాఖ్యానించడం కానీ.., రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈకౌరవ పాలనను అంతమొందించడానికి అన్ని పార్టీలు ఏకంకావాలంటూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు కానీ గ్రౌండ్ రియాలిటీలో పనిచేయడం లేదనేది అనిత చేసిన ట్వీట్ కు వస్తున్న ప్రతిస్పందన నుండి తెలుస్తుంది.
Venkatesh-Trivikram's Aadarsha Kutumbam AK47 is now expected to arrive in theatres on October 30, after…
Bigg Boss Telugu is one of the most entertaining reality shows in the world. The…