
ముందు రోజు సాయంత్రమే ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్సైలు,30 మంది పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు వెంకటాపురం చేరుకొని ఆమెను గృహ నిర్బందం చేశారు. స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకొన్నారు.
పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ, “మేము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రతిపక్ష నేతల ఇళ్ళమీదకి ఇలా పోలీసులను పంపించి ఎవరినీ గృహ నిర్బందం చేయలేదు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలతో ఇంత అమానుషంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోంది. గొందిరెడ్డిపల్లిలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తుంటే వెళ్ళి రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకొందామని అనుకొన్నాము. కానీ మా మండలంలో రైతుల వద్దకు వెళ్ళేందుకు కూడా మాకు అనుమతి లేదంటే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నట్లే ఉంది,” అని అన్నారు.
ధర్మవరంలో కూడా భారీగా పోలీసులను మోహరించి పరిటాల శ్రీరామ్ను కూడా గృహ నిర్బందం చేశారు. కానీ స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తల సాయంతో బయటకు వచ్చి ఇంటి ముందు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ, “వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకొంది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం మీటర్లు బిగించడానికే ఎందుకు మొగ్గు చూపుతోంది? రైతులను అదుకొంటున్నామని గొప్పగా చెప్పుకొనే జగన్ ప్రభుత్వం వారి జీవితాలతో ఎందుకు ఈవిదంగా ఆడుకొంటోంది?” అని సూటిగా ప్రశ్నించారు.
ఈ ధర్నాలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి గుడుపూటి నారాయణస్వామి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రంగయ్య, సర్పంచ్ లలితమ్మ, మండల కన్వీనర్ సుధాకర్, ప్రధాన కార్యదర్శి మారుతీ ప్రసాద్, టిడిపి నేతలు పరందామా యాదవ్, కమతం కాటయ్య, నాయకులు శ్రీరామ్మూర్తి నాయుడు, దండు ఓబుళేశు, నెట్టెం వెంకటేశ, తెలుగు యువత మండల అధ్యక్షుడు లింగా శ్రీధర్ నాయుడు, రాప్తాడు, ధర్మావరం నియోజకవర్గానికి చెందిన పలువురు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…