
“తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణి పై తప్పుడు కేసు పెట్టిందే కాక…. బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కింద కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు!@APPOLICE100, “ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
“తెలుగుమహిళ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముల్పూరి సాయికల్యాణి అరెస్ట్ అమానవీయం. ప్రశ్నించడమే పాపంగా, మహిళలపై అక్రమంగా హత్యా యత్నం కేసు నమోదు చేసి, బెడ్ రూంలో జొరబడి తీవ్రవాదిలా అరెస్ట్ చేయడం జగన్ పిరికితనానికి నిదర్శనం. పొలీసులు అధికార పార్టీ వారిని తృప్తి పరచడానికి పని చేస్తున్నారా?” అంటూ వంగలపూడి అనిత ప్రశ్నించారు.
తనని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను “ఆరోజు మా టిడిపి కార్యాలయంపై వంశీ అనుచరులు దాడులు చేస్తుంటే, కార్లు తగలబెడుతుంటే మీ పోలీసులు అందరూ ఎక్కడున్నారు? మాపై దాడులు చేసినవారిని పట్టుకోలేరు. కానీ మా ఇళ్ళలోకి జొరబడి మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటారు?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
MS Dhoni's role at Chennai Super Kings (CSK) has become a talking point ahead of…
After a long wait, Rajkummar Rao’s Prahaar has arrived on the big screen. The actor…