
సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం వైఎస్ జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ భేటీ అయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి గణేష్‌ను వెంటబెట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారులకు కండువా కప్పి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. అనర్హత తప్పించుకోవడానికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పుకోలేదు.
అయితే ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ పార్టీలో చేరినట్టు చెప్పారు. ఒకపక్క వలసలను ప్రోత్సహిస్తూ… ఉపఎన్నికలు రాకుండా… రాజీనామా చెయ్యకుండా తీసుకున్నాం అని అనిపించుకోకుండా తమ విలువలకు టెక్నికల్ కారణాలు అడ్డుపెట్టుకుంటున్నారు జగన్. ఇది నీతిమంతమైన విలువల అంటే కచ్చితంగా కాదనే చెప్పుకోవాలి.
151 సీట్లు వచ్చినా అదే అభద్రతా భావం… వేలకోట్లు గుమ్మరిస్తున్నా ఉపఎన్నికలు ఎదురుకునే ధైర్యం లేకపోవడం ఏంటి? అంటూ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే గెలిచిన 23 సీట్లలో ఇప్పటికే నాలుగు సీట్లు పోగొట్టుకుంది. గతంలో వలసలు ప్రోత్సహించడంతో ఇప్పుడు ఎటు మాట్లాడలేని పరిస్థితి.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…