
దానికి వర్ల రామయ్య ఘాటుగా బదులిస్తూ, “నేటి నుంచి రాబోయే 12 నెలల్లో ప్రతీరోజూ మీ కార్యాలయానికి ఎంతమంది వస్తారు?ఎన్ని వాహనాలు వస్తాయి?వాటి వివరాలు ఇవ్వగలరా?”అంటూ ప్రశ్నించారు. అది చెప్పడం సాధ్యం కాన్నట్లే నారా లోకేష్ పాదయాత్ర ఏడాది షెడ్యూల్, పూర్తి వివరాలు ఇవ్వలేమని వర్ల రామయ్య తెలియజేశారు. ఒకవేళ ఏదో కారణంతో నారా లోకేష్ని పాదయాత్రకి అనుమతించకపోయినా తప్పకుండా చేస్తారని వర్ల రామయ్య స్పష్టం చేశారు.
దానిపై డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించలేదు కానీ చిత్తూరు ఎస్పీ స్పందిస్తూ పాదయాత్రకి అనుమతిస్తున్నట్లు చిత్తూరు టిడిపి నేతలకి తెలియజేశారు. అయితే పాదయాత్రలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, నిబందనలకి లోబడే పాదయాత్ర చేసుకోవాలని సూచించారు.
దీంతో నారా లోకేష్ సుదీర్గ పాదయాత్ర తొలి ఆటంకం తొలగిపోయింది. జనవరి 27 మధ్యాహ్నం నారా లోకేష్ స్థానిక దేవాలయంలో పూజలు చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తారు. కుప్పం నియోజకవర్గంలోనే మూడు రోజులపాటు పాదయాత్ర సాగుతుంది. కుప్పం నుంచి 400 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల గుండా 4,000 కిమీ పాదయాత్ర చేస్తూ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగిస్తారు.
ఇది వరకు పాదయాత్రకు దారి పొడవునా ఏర్పాట్లు చేసుకొంటే సరిపోయేది. కానీ ఇప్పుడు నారా లోకేష్పై వైసీపీ శ్రేణులు దాడులు చేయవచ్చని టిడిపి నేతలు అనుమానంగా ఉన్నారు. కనుక భద్రతా ఏర్పాట్లు కూడా చేసుకొంటున్నట్లు తెలుస్తోంది.
SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…
The NDA alliance is facing growing discontent over seat sharing in Tiruvuru and Salur, with…