
దారిలో ఆర్యవైశ్య పెద్దలని కలిసి నారా లోకేష్ వారి ఆశీర్వాదాలు తీసుకొన్నారు. స్థానిక వైసీపీ నేతల నుంచి తాము నిరంతరం తీవ్రమైన ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ వ్యాపారాలు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు నారా లోకేష్కి తెలియజేశారు. వైసీపీ నేతల వేధింపులు భరించలేక కొంతమంది వ్యాపారాలు మూసుకొంటే, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ వారి సమస్యలన్నీ ఓపికగా విన్నాక టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ని పునరుద్దరించి ఆర్యవైశ్యులకు అన్ని విదాలా తోడ్పడతామని చెప్పారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం తర్వాత నారా లోకేష్ సమక్షంలోఎమ్.సి. పాలెంకు చెందిన 20 మంది యువయువకులు, రంగాపురానికి చెందిన 20 కుటుంబాలు, పలమనేరు పట్టణం పెద్దమసీదు వీధికి చెందిన 20 ముస్లిం కుటుంబాలవారు, మాజీ సర్పంచ్ తదితరులు టీడీపీలో చేరారు.
నారా లోకేష్ వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రంలో టిడిపి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు వారందరి సమస్యలు తప్పకుండా తీర్చుతానని నారా లోకేష్ వారికి హామీ ఇచ్చారు.
SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…
The NDA alliance is facing growing discontent over seat sharing in Tiruvuru and Salur, with…