Telugu

అభివృద్ధి చేస్తే కనిపించాలి గానీ సత్య ప్రమాణాలు దేనికో?

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలను అమలుచేయడమన్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డే మాట్లాడుతుండటం అందరూ వింటూనే ఉన్నారు. కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరిగిపోతోందని వైసీపీ నేతలందరూ తానతందాన పాడుతున్నారు. అయితే అభివృద్ది పనులు చేస్తే, తెలంగాణ రాష్ట్రంలోలాగ అందరి కళ్ళకు కనిపించాలి కానీ ఏపీలో కనిపించడం లేదంటే చేయడం లేదనే కదా అర్ధం?

ADVERTISEMENT

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత పల్లె రఘునాధ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలని వైసీపీ నేత శ్రీధర్ రెడ్డికి సవాలు విసిరారు. ఆ సవాలును ఆయన స్వీకరించారు. చేసిన అభివృద్ధిని తీసుకువెళ్లి చూపిస్తానంటే ప్రతిపక్ష నేతలు కూడా చాలా సంతోషిస్తారు. కానీ శ్రీధర్ రెడ్డి జిల్లా, నియోజకవర్గం అభివృద్ధిపై స్థానిక సత్తెమ్మ ఆలయంలో సత్య ప్రమాణం చేస్తానని దమ్ముంటే పల్లె రఘునాధ రెడ్డి కూడా రావాలని ప్రతి సవాలు విసిరారు.

ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపించమంటే చూపించకుండా సత్య ప్రమాణాలు చేయడం ఏమిటి?అని పల్లె రఘునాధ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. అయినప్పటికీ శనివారం ఉదయం 10 గంటలకు సత్తెమ్మ ఆలయం వద్ద శ్రీధర్ రెడ్డితో చర్చకు పల్లె రఘునాధ రెడ్డి తన అనుచరులతో కలిసి సత్తెమ్మ ఆలయానికి బయలుదేరారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని సత్తెమ్మ ఆలయానికి వెళ్ళేందుకు అనుమతించబోమంటూ పల్లె రఘునాధ రెడ్డిని టిడిపి కార్యాలయంలోనే నిర్బందించారు.

అప్పటికే అక్కడకి భారీ సంఖ్యలో టిడిపి కార్యకర్తలు చేరుకొన్నారు. అదే సమయంలో శ్రీధర్ రెడ్డి అనుచరులు అక్కడికి రావడంతో ఇరు వర్గాల మద్య ఘర్షణ మొదలైంది. పరస్పరం దాడులు చేసుకొన్నారు. పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

శుక్రవారమే మందడం గ్రామం వద్ద వైసీపీ కార్యకర్తలు బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బిజెపి కార్యకర్తలపై రాళ్ళు, కర్రలతో దాడులు చేశారు. పోలీసులు అడ్డుపడకపోయుంటే ఈరోజు పుట్టపర్తిలో టిడిపి కార్యాలయంపై దాడులు జరిగి ఉండేవి. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్నా డిజిపి స్పందించడం లేదని టిడిపి, జనసేనలు ఆరోపిస్తున్నాయి. కానీ వాటి గోడు వినేవారెవరు?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2 BO 2nd Day: Rajinikanth’s 1000 Crore Dream ON?

Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…

45 minutes ago

Why Ramayan Release Crucial for Shah Rukh Khan’s King?

Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…

1 hour ago