
వైఎస్సార్ కాంగ్రెస్ కు చాలా దూరంగా టీడీపీ రెండో స్థానంలో…. అలాగే మూడవ స్థానంలో జనసేన ఉండిపోయింది. ఇది ఇలా ఉండగా… పలు చోట్ల ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓటు వేసిన విజయవాడ కార్పొరేషన్‌లోని 9వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు.
ఆ పార్టీ అభ్యర్ధి క్రాంతిశ్రీ గెలుపొందారు. విజేత ప్రకటనతో వైసీపీ అభ్యర్ధి శారద కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే… విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు దిశగా పయనిస్తోంది. గెలిచే అవకాశం ఉన్న చోట టీడీపీ నేతలు అంతర్గత కుమ్ములాటల కారణంగా చేజార్చుకున్నారు.
ఓటింగు రెండు మూడు రోజుల ముందు కూడా మీడియా ముందుకు వచ్చి ఒకరి మీద ఒకరు బురద జల్లుకున్నారు. చివర్లో చంద్రబాబు కొంత సర్దుబాటు చేసినా అప్పటికే నష్టం జరిగిపోయింది. పైకి కలిసినట్టు నటించినా ఒకరికి ఒకరు గోతులు తవ్వుకున్నారని సమాచారం.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…