
కబడ్డీ లో అటు రైడర్లు ఇటు ఢిఫెండర్లు సమాన బరిలో ఉంటేనే ఒక జట్టు విజయం సాధించగలదు. అలాగే, ఫుట్-బాల్ లో కూడా అటు అటాక్ కు వెళ్లే ప్లేయర్, ఇటు డిఫెండ్ చేసే సభ్యులు మరోపక్క గోల్-కీపర్, ఇలా ఈ 3 విభాగాలు కలిసికట్టుగా ఉంటేనే విజయం ప్రాప్తిస్తుంది. అలాగే క్రికెట్ లో కూడా ఒక జట్టు విజయం వెనక బ్యాటర్ బ్యాట్ బలం – బౌలర్ బాల్ పవర్ సమంగా ఉండాలి.
కానీ ప్రస్తుత భారత క్రికెట్ జట్టును చూస్తుంటే ఈ బ్యాలెన్స్ మిస్ అయినట్టే కనిపిస్తుంది. ప్రస్తుతం టీం ఇండియా ఆడుతున్న ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో భారత్ బౌలింగ్ విభాగమంతా బుమ్రా పై భారం మోపినట్టే కనపడుతుంది. సిరాజ్, అర్షదీప్, హర్షిత్, కుల్దీప్, ప్రసిద్ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ, నిలకడైన ప్రదర్శన చూపటంలో వీరు విఫలమవుతున్నారు.
టి-20 ఫార్మట్ లో మన బౌలింగ్ పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ, వన్-డే మరియు అతిముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్ లో బౌలింగ్ సమస్యలు బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు భువి, జహీర్, షమీ, అశ్విన్, నెహ్రా వంటివారు మెయిన్-బౌలర్లు గా ఉన్నప్పుడు మనకు ఈ బౌలింగ్ పరాజయాలు పెద్దగా ఉండేవి కాదు.
అతిముఖ్యంగా గత 2-3 ఏళ్ళ గానే ఈ బౌలింగ్ విభాగం వల్ల వైఫల్యాలు మరీ పెరిగిపోయాయి. సొంత పిచ్ల మీద వైట్-వాష్ అవ్వటం, వికెట్ పడగొట్టకుండా సెషన్లు-సెషన్లు బౌలింగ్ చేయటం, ఇలాంటి పరిణామాలన్నీ గత 2-3 ఏళ్ళ గానే మనం చూస్తున్నాం.
‘ఇదంతా కేవలం అంతర్జాతీయ స్థాయిలోనే.. దేశవాళీ లో ఆడే ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా మన బోర్డు యాజమాన్యం ఏమైనా తప్పులు చేస్తుందా’ అంటే, అది కూడా కాదు. దేశవాళీ లో ఫేమ్ వచ్చిన బౌలర్ కొంత కాలం పాటు న్యూస్ లో ఉంటూ, మరలా మామూలు ప్రదర్శన కే పరిమితమవుతున్నారు.
2024 ఐపీఎల్ లో ‘మయాంక్ యాదవ్’ వంటి ఒక స్పీడ్-గన్ దొరికాడని సంతోషించే లోపలే అతను గ్రౌండ్ లో కన్నా రిహాబిలిటేషన్ సెంటర్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రావటం-ఒక్క మ్యాచ్ లేదా సిరీస్ బౌలింగ్ చేయడం- ఇంజురీ కి గురయ్యి తిరిగి ఎన్.సి.ఏ కు వెళ్ళటం. ఇదే లూప్ లో జరుగుతుంది. ఇతనొక్కడే కాదు, అందరిది ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇచ్చిన అవకాశాన్ని వారు సరిగ్గా సద్వినియోగించుకోలేకపోతున్నారు.
ఇలా జాతీయ జట్టు లో చోటు కోసం బ్యాటర్లు క్యూలు కడుతుంటే, ప్రతి సిరీస్ జట్టులో ఏ బ్యాటర్ ఉండాలో, ఏ బ్యాటర్ ని పక్కన పెట్టాలో అని పది లెక్కలేస్తున్న సెలెక్టర్లు, బౌలర్ల విషయానికొస్తే పెద్దగా ఆలోచించే పని లేకుండా పోయింది.
బుమ్రా, సిరాజ్, అర్షదీప్, హర్షిత్, ప్రసిద్, కుల్దీప్, వరుణ్.. ఇలా వీరందరూ పొట్టి ఫార్మాట్లో గట్టిగానే ఉన్నప్పటికీ స్పెషలిస్ట్ టెస్ట్ బౌలర్ల అవసరం టీమ్ ఇండియా కు ఎంతైనా లేకపోలేదు! దీనితో టీం ఇండియా కి బ్యాట్ పవర్ సరిపోయింది కానీ బౌల్ జోరు తగ్గింది అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…