
గతంలో సినీపరిశ్రమను ప్రోత్సహించడానికి నటీ నటులను గౌరవించడానికి ప్రభుత్వాలు కళాకారులకు నంది అవార్డులను బహుకరించేది. రానురాను వాటి జాడ లేకుండా పోయాయి. తమ కళకు తగ్గ గౌరవం సొంత రాష్ట్ర ప్రభుత్వాలే ఇవ్వకపోవడం అటు ఇండస్ట్రీ పెద్దలను కూడా బాధించిన అంశంగానే చెప్పాలి.
తమ కష్టాన్ని గుర్తించి ఇచ్చే గౌరవంగా భావించి వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు కళాకారులు. వివిధ కెటగిరీలలో ఈ అవార్డుల ఎంపిక జరుగుతూ ఉండేది. తమ నటనతో, తమ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించిన సినిమాలకు, నటులకు,దర్శకులకు ఇతర కళాకారులకు ప్రభుత్వం ఈ నంది అవార్డులు ఇచ్చి సత్కరించేది.
రాష్ట్ర విభజన తరువాత కూడా ఒకటిగా ఉన్న తెలుగు సినీ ఇండస్ట్రీని గౌరవించడానికి 2014 లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే వాటిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడంతోనో లేక ప్రభుత్వాలు మారడంతోనో ఏపీలో అవార్డుల ప్రదానోత్సవం ఆగిపోయింది. ఆస్కార్ దాక ఎదిగిన తెలుగు ఇండస్ట్రీని సొంత రాష్ట్రంలోనే అణిచివేయడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేసింది అంటూ ఇండస్ట్రీలోనే కొందరు తమ ఆవేదనను వ్యక్తం చేసారు.
అయితే, కొత్తగా ఏర్పడిన తెలంగాణలో తెరాస ప్రభుత్వం నంది అవార్డుల ఊసే ఎత్తలేదు, అలాగే సినీ పెద్దలు కూడా అడిగే సాహసం చేయలేకపోవడంతో ఈ అవార్డులు మరుగున పడిపోయాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం నంది అవార్డుల అంశం తెర మీదకు వచ్చింది.
నంది అవార్డుల స్థానంలో గద్దరన్న పేరు మీద సినీ పరిశ్రమకు అవార్డులు అందించబోతున్నాం అంటూ గద్దర్ జయంతి వేడుకలలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గద్దర్ తన పాటలతో ఎంతో మందిని కదిలించారు. అటువంటి కళాకారుని పేరు మీద సినీ పరిశ్రమకు చెందిన అవార్డులు ఇవ్వడం అంటే అటు గద్దర్ ను గౌరవించినట్లే, ఇటు ఇండస్ట్రీ వారిని సత్కరించినట్లే భావించాలి. రేవంత్ సినీ ఇండస్ట్రీ కి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా హర్షించదగినది.
సినీ ఇండస్ట్రీ పై ప్రభుత్వాలు ఎప్పుడు సఖ్యతగా ఉంటూనే వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలను మరిపించి ఇండస్ట్రీ పెద్దలను తమ వైపు తిప్పుకోవడానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ఎప్పుడు వారికీ సహకరిస్తూ ముందుకు వెళుతూనే ఉంటాయి. కానీ ఒక్క ఆంధ్రపద్రేశ్ లో మాత్రం ప్రభుత్వాలు మారడంతో సినీ ఇండస్ట్రీకి కొన్నాళ్ళు సినిమా కష్టాలు, మరి కొన్నాళ్లు సీరియల్ కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ “గద్దరన్న” అవార్డులు ఇస్తే ఏపీలో “జగనన్న నియమాలు – నిబంధనలు” అవార్డులుగా అందుకున్నారు సినీపెద్దలు.
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…
Sundeep Kishan usually keeps things low-key while promoting his films and rarely makes big claims…