
విశాఖను రాజధాని చేస్తామని దాంతో ఉత్తరాంద్ర జిల్లాలు ఎంతగానో అభివృద్ధి చెందుతుటాయని గట్టిగా వాదిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ళలో విశాఖ నగరంలో కొత్తగా ఒక్క ఫ్లైఓవర్ నిర్మాణం కూడా మొదలుపెట్టలేదు. విశాఖ నగరంలోనే కనీసం ఓ 10-15 రద్దీ కూడళ్ళలో ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంది. కానీ అప్పుడెప్పుడో టిడిపి హయాంలో సిరిపురం వైపు నుంచి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళేందుకు నిర్మించిన ఒకే ఒక ఫ్లైఓవర్ మాత్రమే కనిపిస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, పట్టణాలలో ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించాలో బహుశః ఎవరూ లెక్కచెప్పలేకపోవచ్చు.
ఈరోజు హైదరాబాద్‌లోని నాగోల్ వద్ద రూ.143.58 కోట్లు వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ఆ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇటువంటి ప్రాజెక్టులు 47 సాగుతుండగా ఈ 7-8 ఏళ్లలోనే వాటిలో 31 పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ డిసెంబర్‌లోగా నగరంలో మరో మూడు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఏడాదికి కనీసం రెండు మూడు ఫ్లైఓవర్లు ప్రారంభోత్సవం జరుగుతూనే ఉంటాయి. ఆ వార్తను వైసీపీ ఆత్మసాక్షిలో గొప్పగా వేసుకొంటారు తప్ప వాటిని చూసి మన మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గుపడకపోవడమే గొప్ప.
తరచు హైదరాబాద్‌కి రాకపోకలు సాగించే మన మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రతీసారి నగరంలో ఓ కొత్త ఫ్లైఓవర్ కనిపిస్తూనే ఉంటుంది. దానిపైనే వారు ప్రయాణిస్తుంటారు కూడా. కానీ మన ప్రభుత్వం మన రాష్ట్రంలో ఎందుకు ఫ్లైఓవర్లు నిర్మించలేకపోతోంది? కనీసం రోడ్ల మీద గుంతలు కూడా ఎందుకు పూడ్చలేకపోతోంది?అని ఆలోచిస్తారో లేదో తెలీదు.
హైదరాబాద్ ఫ్లైఓవర్లు, స్కై వాక్‌లు, చివరికి సైకిలింగ్ ట్రాకులు కూడా నిర్మిస్తుంటే, ఇటీవలే జిల్లా హోదా పొందిన అనకాపల్లిలోని మాడుగుల నియోజకవర్గంలో ఉరకగెడ్డ మీద గిరిజనులు కర్రల వంతెన నిర్మించుకోవలసి వచ్చింది.
ఉరకగెడ్డ పొంగి ప్రవాహిస్తుండటంతో శంకరం పంచాయతీలోని 14 గ్రామాలలోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మామిడిపాలెం గ్రామస్తులందరూ కలిసి కర్రలతో ఓ తాత్కాలిక వంతెన ఏర్పాటు చేసుకొని దాని మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.
ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును ఈదుకొని దాటడం కంటే ఇది కాస్త సురక్షితమే కానీ చిన్న పిల్లలు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు పట్టు తప్పి ఆ కర్రల వంతెన మీద నుంచి కింద వాగులో జారిపడితే ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధిలో పోల్చి చూసుకొనేందుకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి?
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…
Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…