
‘అసలేం జరుగుతోంది’ అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యంగా 48,600 కార్మికులు విధుల్లో చేరకుండా సెల్ఫ్ – డిస్మిస్ చేసుకున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం పట్ల ఆమె తీవ్రంగా స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి. కార్మిక చట్టాల్లో ‘సెల్ఫ్ డిస్మిస్’ అనే పదం ఉందా? అని ఆమె ప్రశ్నించినట్లు సమాచారం.
ఆ పదం లేకుండా కొలువుల నుంచి 48 వేల మంది కార్మికులు తొలగిపోయినట్లు ఎలా చెబుతారని నిలదీసినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన గవర్నర్… సుమారు 40 నిమిషాల పాటు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తరువాత అమిత్ షా ను కూడా కలిశారు. ఆ పర్యటన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.
గవర్నర్ ద్వారా ఆర్టీసీ కార్మికులను బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. భేటీ అనంతరం సునీల్ శర్మ ప్రగతి భవన్‌కు వెళ్లి గవర్నర్ ఫోన్ సంభాషణ గురించి ముఖ్యమంత్రికి వివరించినట్టు సమాచారం. ఇది ఇలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మె పద్నాలుగో రోజుకు చేరింది. రేపు తెలంగాణ బంద్ కు వారు పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…