
ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు తోడు కొత్తగా మరో 17 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ఆగస్టు 22న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దసరా నాటికి కొత్త జిల్లాలను ప్రకటించాలని యోచిస్తున్న ప్రభుత్వం అదే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందుకు మరికొన్ని రోజులే గడువు ఉన్న సమయంలో తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోని జనగామలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ మూడింటిని జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ చాలారోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
గద్వాల జిల్లా కోసం రాజీనామా కూడా చేస్తానని మాజీ మంత్రి అరుణ ప్రకటించారు కూడా. ఇక సిరిసిల్ల నుంచి ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తుండడం, జనగామలో మెజారిటీ ప్రజలు జిల్లా కావాలని కోరుకుంటుండడంపై ఈ మూడింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ఈ విషయంలో సీఎం కేసీఆర్ పలువురు ప్రజాప్రతినిధులు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం.
కొత్తగా 17 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటికి అదనంగా మరో మూడు కలపడం వల్ల జరిగే నష్టమేమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దే తుది నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హల్చల్ చేస్తున్నట్లుగా కార్యరూపం దాలిస్తే… మరికొద్ది రోజుల్లోనే 20 జిల్లాలతో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…