
వారు తప్పు చేశారని భావిస్తే ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు గానీ.. అసెంబ్లీ బహిష్కరణ సరికాదని న్యాయస్థానం పేర్కొంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో కోమటిరెడ్డి వెంటకరెడ్డి హెడ్‌ఫోన్‌ను విసరగా అది శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలింది.
క్రమశిక్షణా రాహిత్యంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌పై ప్రభుత్వం అసెంబ్లీ బహిష్కరణ విధించింది. వారి శాసన సభ్యత్వాలు రద్దయినట్లు జీవో జారీచేసింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసింది. అయితే స్వామిగౌడ్‌పై దాడికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలనుకుంటే ఈ తీర్పు అడ్డంకి కాదని కోర్టు తెలిపింది.
Abhishek Sharma delivered a standout performance as SunRisers Hyderabad faced Delhi Capitals in IPL 2026…
A few days ago, Vijay's final film, Jana Nayagan directed by H Vinoth was leaked…