Telugu

ఈ రేట్లతో సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతాయేమో..!

నిన్న తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్స్ టికెట్ రేట్ల విషయంలో ఒక కొత్త జీవో తీసుకొచ్చి.. సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లను దాదాపుగా మల్టీప్లెక్స్ థియేటర్లకి సమానంగా మార్చుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ స్క్రీన్స్ ను బ్రతికించాలంటూ గత కొన్నాళ్లుగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న పోరాటంలో ఇదొక విజయంగా పరిగణిస్తున్నారు కొందరు.

అయితే.. సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వెళ్లే ఆడియన్స్ సెట్ ఎవరు? పీవీఆర్, ఏషియన్, ఐనాక్స్ లాంటి మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చే థియేటర్లకు వద్దనుకొని.. కనీసం బాత్రూములు కూడా కడగని సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ఎందుకు వెళ్తున్నారు అంటే ఏకైక సమాధానం టికెట్ రేట్లు మరియు స్నాక్స్ రేట్లు.

ADVERTISEMENT

ఒక ఐదుగురు కుటుంబ సభ్యులు సింగిల్ స్క్రీన్ లో సినిమా చూడాలంటే అయ్యే ఖర్చు టికెట్లకు 750, స్నాక్స్ కి ఒక 250. మొత్తం 1000 లోపు అయిపోతుంది. అదే సినిమా మల్టీప్లెక్స్ లో చూడాలంటే మాత్రం ఏకంగా 2000 రూపాయలు కేవలం టికెట్లకే అవుతుంది. ఇక స్నాక్స్ కి మరో 1000 రూపాయలు. మొత్తంగా 3000 రూపాయల ఖర్చు.

అందుకే ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీస్ & మిడిల్ క్లాస్ ఆడియన్స్ సింగిల్ స్క్రీన్స్ ప్రిఫర్ చేస్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ కలెక్షన్స్ అందుకు నిదర్శనం. అలాంటిది.. ఇప్పుడు ఆ సింగిల్ స్క్రీన్ రేట్లను కూడా 300 రూపాయలకి పెంచి ఆ వచ్చే సగం మంది ప్రేక్షకుల్ని కూడా మల్టీప్లెక్సుల వైపు డైవర్ట్ చేస్తున్నారే తప్ప.. సింగిల్ స్క్రీన్స్ ఓనర్స్ లేదా థియేటర్లకి చేసే మంచేమీ లేదు.

మరి ఈ నిర్ణయం వెనుక ఎవరున్నారు? ప్రభుత్వం ఉన్నపళంగా ఈ టికెట్ రేట్లు ఎందుకు పెంచింది? దీని వల్ల ఎవరికి లాభం? అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. మరి టికెట్ హైక్స్ భారం ప్రేక్షకుల మీద పడకూడదు అని బీరాలు పలికిన శిరీష్ రెడ్డి.. ఈ టికెట్ రేట్స్ పెంచడాన్ని ఎంతవరకు అడ్డుకుంటాడో చూడాలి.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

నాని చేసిన తప్పే విజయ్ కూడా చేస్తున్నాడా?

ప్యారడైజ్ సినిమా ప్రమోషన్స్ టైంలో పాన్ ఇండియా అనే పదాన్ని ఎక్కువగా ఎబ్యూజ్ చేస్తున్నామని చెప్పి మరీ.. తెలుగులో తప్ప…

7 hours ago

Rashmika Dragged Again: Kannada Cinema Targeting Her?

Kannada cinema is increasingly proving that films made on modest budgets can find audiences beyond…

8 hours ago