
అయితే అందరిలోనూ అయోమయం ఫైనల్ గా ఎవరికీ టికెట్ దొరుకుతుందో అని. కార్యకర్తల్లో కూడా అయోమయానికి దారితీసి అక్కడక్కడా గొడవలు కూడా జరుగుతున్నాయి. సిటింగ్‌లు అందరికీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే భరోసా ఇచ్చారు. అయితే, కొన్నిచోట్ల సిటింగ్‌లకు టికెట్లు ఇస్తే, పార్టీ కోసం పని చేసిన నేతలకు న్యాయం జరగదు.
మరికొన్నిచోట్ల సిటింగ్‌లకు టికెట్లు ఇస్తే పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని సర్దుబాటు చేయడం కుదరదు. ఈ క్రమంలో సర్వత్రా అయోమయం నెలకొంది. ఇదే పరిస్థితి కొనసాగితే సొంత పార్టీలలో ముసలం వల్ల వచ్చే ఎలక్షన్ లో నష్టపోయే పరిస్థితి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
అయితే ఎవరు పోటీలో నిలిచినా కేసీఆర్ నా బొమ్మతోనే గెలిపిస్తా అని ధైర్యంగా ఉన్నారట. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే అందరినీ సర్దుబాటు చేయవచ్చని, ఎలాంటి ఇబ్బంది ఉండదని టీఆర్‌ఎస్ పెద్దలు భావిస్తున్నారు. అది ఉంటుందో ఉండదో తెలిస్తే తదుపరి కార్యాచరణ ప్లాన్ చేస్కుకోవచ్చని ఆయన ప్లాన్. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…