
తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో ఈ దిశగా ‘బిగ్ బాస్’కు ఓ విజ్ఞప్తి చేసాడు ప్రిన్స్. ఇక్కడ అందరూ ఆంటీలే ఉన్నారు, తన వయసుకు సంబంధించి ఒక్క అమ్మాయి కూడా లేదు. ఉదయం పూట జిమ్ చేయాలన్నా ఉత్సాహం రావట్లేదు, అదే పక్కన అమ్మాయిలు ఉంటే వారు చూస్తున్నారున్న ఉత్సాహంతో మరిన్ని ఎక్సర్సైజులు చేస్తాం… ప్లీజ్ ఎవరైనా మంచి అమ్మాయిని పంపించండి… పేర్లు చెప్పమంటే తాను చెప్తాను… వద్దులేండి… మీరే పంపించండి బిగ్ బాస్… అంటూ తన విన్నపాన్ని సీసీ కెమెరా సాక్షిగా వేడుకున్నాడు.
మరి ‘బిగ్ బాస్’ హీరో ప్రిన్స్ విజ్ఞప్తిని పట్టించుకుంటారో లేదో గానీ, ఇప్పటివరకు సాగిన రెండు రోజుల కార్యక్రమం చాలా చప్పగా ఉందనే టాక్ ను సొంతం చేసుకుంది. రొటీన్ తెలుగు మెలో డ్రామా మాదిరి కొనసాగుతుండడంతో, ఇదే విధానం మున్ముందు కొనసాగితే, నిర్వాహకులు ఆశించిన విధంగా విశేషమైన ప్రజాదరణను చూరగొనడం కష్టమైన విషయమే అని చెప్పడంలో సందేహం లేదు. 14 మందిలో కనీసం ఒకరిద్దరూ కూడా క్రేజీ ఆర్టిస్టులు లేకపోవడం ప్రధాన మైనస్.
Romanchakam is getting a special kind of attention ahead of its release tomorrow, thanks to…
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…