
ఆ తరువాత విడతల వారీగా లొక్డౌన్ విరమిస్తారని, దానిని పొడిగించే అవకాశం లేదని కేంద్రప్రభుత్వం ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చింది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు మీద మాత్రం క్లారిటీ రావడం లేదు. విడతల వారీగా అంటే ఎక్కువ జనం గుమ్మికూడే ప్రదేశాలలో లొక్డౌన్ కొనసాగించవచ్చు అని నిపుణులు అంటున్నారు.
దాన్నిబట్టి సినిమా షూటింగ్లు, సినిమా హాళ్లు, మాల్స్ ఇప్పటిలో మొదలు కావు అని అంటున్నారు. మే నెలలో సైతం షూటింగ్లు, సినిమా హాళ్లు ప్రారంభం కావని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వేసవి సెలవులలో కొంత భాగం నష్టపోయింది ఇండస్ట్రీ. ఇదే గనుక జరిగితే నష్టం మరింత భారీగా ఉంటుంది.
విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలతో పాటు, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల విడుదల తేదీలలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది దీనితో పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతుంది. 2020 పరిశ్రమకు ఏ మాత్రం కలిసి రావడం లేదు అనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో, హిట్ మాత్రమే సక్సెస్ సాధించాయి.
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…
One interesting pattern in Anil Ravipudi’s career is becoming hard to ignore. He rarely sticks…