
అటు ఐపీఎల్ లో భారీ ఫ్యాన్-బేస్ ఉన్న జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా 17 ఏళ్ళ పాటు ట్రోఫీ అందుకోకుండానే సీజన్లు ముగించేశారు. విరాట్, ఏ.బీ.డీ, గేల్, మాక్స్వెల్, డు ప్లీసి వంటి అగ్ర ఆటగాళ్లను సమకూర్చినప్పటికీ, ఆ జట్టు ట్రోఫీ అన్వేషణ లో వెనక పడుతూనే వచ్చింది.
ఇటు ప్రో కబడ్డీ లీగ్ లో సైతం కబడ్డీ కే పోస్టర్ బాయ్ అని పిలుచుకునే ‘రాహుల్ చౌదరి’ ను మొట్ట మొదటి సీజన్ నుండి 6వ సీజన్ వరుకు జట్టులో ఉంచుకుని కూడా, ట్రోఫీ ను అందుకోలేకపోయింది తెలుగు టైటాన్స్ జట్టు.
2023-24 వరుకు కబడ్డీ లో నయా సెన్సేషన్ ‘పవన్ సెహ్రావత్’ , ఇంకా సందీప్ నర్వాల్, విశాల్, సిద్ధార్థ్ దేశాయ్, మంజీత్ చిల్లర్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ, ట్రోఫీ మాత్రం అందని ద్రాక్ష లానే మిగిలిపోయింది.
అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇలా స్టార్ ప్లేయర్స్ వెంట పడటం బదులు జట్టు సమకూలత కొరకు ఏ స్థానం లో ఎవరి అవసరం ఉంది అనే ప్రణాళిక తో ఈ 18వ ఐపీఎల్ సీజన్ కోసం ఆక్షన్ బరి లోకి దిగారు. తొలుత అందరూ ట్రోల్ చేసినప్పటికీ, వారు కప్ కొట్టి, అదే తమ సమాధానం అన్నట్టుగా బదులిచ్చారు.
మరి అక్కడ ఆర్.సి.బీ సిరాజ్, జాక్స్, మ్యాక్సీ ల ను వదిలేసినట్టుగా, ఇక్కడ తెలుగు టైటాన్స్ ఆక్షన్ కు ముందు పవన్ ను వదిలేసి ఎవ్వరు ఊహించనటువంటి షాక్ ఇచ్చారు. మరి తెలుగు టైటాన్స్ కూడా ఆర్సీబి మాదిరి కప్పు కొట్టి తమ తలరాతను మార్చుకోగలదా.?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…