
త్రివిక్రమ్ ఎక్కువగా ఇంపుట్స్ ఇస్తున్నట్టుగా కనిపించారు. వీడియో చివరలో, దర్శకుడు సాగర్ కె చంద్ర ‘యాక్షన్’ అని చెప్పడంతో పవన్ లాడ్జిలోకి బైక్ నడుపుతున్నట్లు కనిపిస్తారు. ఈ షాట్ చిత్రం రెండవ భాగంలో వచ్చే షాట్ మరియు పవన్ కళ్యాణ్ స్టైలిష్ గా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్.
గత ఏడాది నుండి సూపర్ ఫామ్ లో ఉన్న థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. ఒక మేకింగ్ వీడియోకి కూడా టీజర్ రేంజ్ హై ఇచ్చింది ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అయ్యప్పనమ్ కోషియంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్… థమన్ ఉన్న ప్రస్తుత ఫామ్ బట్టి ఈ రీమేక్ లో కూడా అది ఇరగదీయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ షెడ్యూల్లో, పవన్కళ్యాణ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో పది రోజుల యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు, దీనిని ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బారాయణ్ కంపోజ్ చేస్తున్నారు. రానా అతి త్వరలో షూట్లో చేరనున్నారు. ఈ ఏడాది రెండో భాగంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సినిమా.
Nani's The Paradise is set to make its OTT debut on Netflix tomorrow, October 22.…
Vijay Deverakonda’s Ranabaali is set to release in Hindi in the US on October 23.…