Telugu

చేసిందంతా చేసి నంగనాచి కబుర్లా థమన్?

మొన్న ఆ మధ్య విశాఖపట్నంలో అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఆ కార్యక్రమంలో థమన్ మాట్లాడుతూ, త్రివిక్రమ్ గారితో పని చేయాలనేది తన చిరకాల వాంఛ అని, అయితే ఎట్టకేలకు అది అరవింద సమేత మూవీతో తీరడం, అలానే ఆ సినిమా హిట్ అయి అందులోని సాంగ్స్ కూడా మంచి పేరు దక్కించుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు.

ఇక ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలవైకుంఠపురములో సాంగ్స్ కు ప్రేక్షకులు అందించిన రెస్పాన్స్ ఎప్పటికీ మరువలేనని, సినిమా మంచి సక్సెస్ సాధించి ముందుకు సాగడం మరింత ఆనందాన్నిచ్చిందని థమన్ చెప్పడం జరిగింది. అయితే మధ్యలో థమన్ మాట్లాడుతూ, నిజ‌మైన మాట‌లే మాట్లాడ‌మంది, నిజ‌మైన‌ క‌ల‌క్ష‌న్లే చెప్ప‌మంది. ఈరోజు చెప్పాం, గెలిచాం, కొట్టాం అంటూ వ్యాఖ్యానించాడు.

ADVERTISEMENT

థమన్ చేసిన ఇవే వ్యాఖ్యలపై మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో మండిపడ్డారు. థమన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమ హీరో నటించిన సరిలేరు సినిమాని కించపరిచే విధంగా ఉన్నాయని, మహేష్ ఇక ముందు థమన్ కు అవకాశం ఇవ్వకూడదని వారు మహేష్ కు ట్వీట్లు చేశారు. దీనితో ఇప్పుడు థమన్ డామేజ్ కంట్రోల్ కు పూనుకున్నాడు.

“నేను అందరి హీరోలతో పని చేస్తా. ఎవరిని కించపరచను. నా వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను కేవలం అల వైకుంఠపురంలో సక్సెస్ జెన్యూన్ అని చెప్పా,” అన్నారు. అయితే మహేష్ అభిమానులు మాత్రం ఎంత మంత్రం ఈ వివరణతో కన్విన్స్ కావడం లేదు. చేసిందంతా చేసి నంగనాచి కబుర్లా థమన్? అంటూ విరుచుకుపడుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

418 Review: Short on Scares

BOTTOM LINE Short on Scares RATING 2/5 Story, Screenplay, Director: Kirtan Nadagouda Cast: Chaithra J.…

27 minutes ago

Pics: Avneet Paints Brown Glam With Royal Attitude

Avneet Kaur steps into this gallery with a rich brown statement drape and a mood…

35 minutes ago