
గత కొద్దీ కాలంగా వెండి తెర మీద అక్కినేని వారి మెరుపులు కనుమరుగయ్యాయనే చెప్పాలి. అటు సీనియర్ హీరో నాగార్జున నుండి ఇటు నాగ చైతన్య, అఖిల్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు అక్కినేని బ్రాండ్ నిలుపుకునేలా ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు.
మజిలీ, లవ్ స్టోరీ సినిమాల వరుస విజయాల తరువాత వచ్చిన చై మూవీలు అక్కినేని అభిమానులను బాగా నిరాశ పరిచాయి. ఇక అఖిల్ అయితే సక్సెస్ అనే పదానికి అందనంత దూరంలో ఉన్నాడా అనేక వరుస అపజయాలతో తండ్రి సినీ వారసత్వంతో కెరీర్ మీద పోరాటం చేస్తున్నారు.
ఇక నాగార్జున విషయానికి వస్తే ఆ తరం సీనియర్ హీరోలంతా వరుస సినిమాలతో ఊపుమీద ఉంటే ఈయన మాత్రం బిగ్ బాస్ అంటూ బుల్లి తెర మీద సందడి చేస్తున్నారు. డాకు మహారాజ్ తో బాలయ్య ఆయన కెరీర్ బెస్ట్ కలెక్షన్లతో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతుంటే, విక్టరీ వెంకటేష్ తన పేరులో ఉన్న విక్టరీ కి నిజమైన అర్ధం చెపుతూ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఈ సంక్రాంతి హీరోగా పై చెయ్యి సాధించారు.
ఇక చిరంజీవి విశ్వంభర, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడి తో సినిమాలంటూ అంటూ హడావుడి చేస్తుంటే నాగార్జున మాత్రం గెస్ట్ రోల్స్ తో సరిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 7 న థియేటర్లలో సందడి చేయబోతున్న నాగ చైతన్య తండేల్ మూవీ విజయం అటు ‘చై’ కెరీర్ కే కాదు ఇటు ‘అక్కినేని’ కుటుంబానికి కూడా ఆక్సిజన్ లా పని చేస్తుంది.
ఇప్పటికే విడుదలైన పాటలు, మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో నాగ చైతన్య చెప్పినట్టు ఈపాలి ‘రాజు గాడి ఏట’ గురితప్పేదిలేస్ అయ్యేలాగే కనిపిస్తుంది. దానికి తోడు సాయి పల్లవి, చైతన్య జోడి కూడా ఈ సినిమాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకువస్తే, చై, శోభిత వివాహం తరువాత వస్తున్న అక్కినేని వారి తొలి సినిమా తండేల్ కావడం ఆసక్తికరంగా మారింది. తండేల్ మూవీ తో నాగ చైతన్య అక్కినేని వారికీ ఈ ఏడాది శుభారంభం చేస్తారా అనేది చూడాలి.
Reports about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 hitting a roadblock have created fresh confusion…
BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…