
తెరపై హీరోగా కనిపించాలంటే ఎంతలా కష్టపడాలో చిరంజీవి మరోసారి రుజువు చేస్తున్న ఘటన ఇది. ఒక మెగాస్టార్ హోదాలో చిరు ఎలా ఉన్నా చూడడానికి ఉన్న అభిమానులు కోకొల్లలు. అయితే, తన ఫిజిక్ విమర్శలకు తావివ్వకూడదని భావించిన మెగాస్టార్ జిమ్ లో పరికరాలకు పని చెప్పారు. అయితే ఇందులో చెప్పుకోవాల్సిందేముంది అనుకుంటే పొరపాటే…
ఎందుకంటే… ఇటీవలే మెగాస్టార్ భుజానికి ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. దీని వలన చేతికి కట్టు ఉన్న విషయం కూడా అందరికీ తారసపడే విషయమే. అయితే ఇంతటి కట్టులోనూ, ఒంటి చేత్తో మెగాస్టార్ జిమ్ లో సందడి చేస్తూ కనపడడంతో అభిమానులు తట్టుకోలేక దటీజ్ మెగాస్టార్… అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలోని మణికొండ ప్రాంతంలో ‘రాగాస్ ప్లెక్స్’ పేరిట చిరంజీవికి పర్సనల్ జిమ్ ట్రైనర్ గా ఉన్న ప్రవీణ్ రెడ్డి వ్యాయామశాలను ఏర్పాటు చేయగా దాన్ని ప్రారంభించిన చిరంజీవి, వ్యాయమ పరికరాలను పరిశీలిస్తూ, కాసేపు కసరత్తులు చేసారు.
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…
Finally, Vikram's long pending project Dhruva Natchathiram, directed by Gautham Vasudev Menon, is all set…